Feng shui tips: మీ ఇంటికి ఈ అద్దాన్ని తగిలించారంటే అదృష్టం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి-where to place the bagua mirror in the house know its benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Feng Shui Tips: మీ ఇంటికి ఈ అద్దాన్ని తగిలించారంటే అదృష్టం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి

Feng shui tips: మీ ఇంటికి ఈ అద్దాన్ని తగిలించారంటే అదృష్టం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి

Gunti Soundarya HT Telugu
Sep 19, 2024 05:00 PM IST

Feng shui tips: అద్దం అనగానే మనం మొహం చూసుకునేది గుర్తుకు వస్తుంది. కానీ ఈ బగువా అద్దం మాత్రం అలాంటిది కాదు. ఫెంగ్ షూయి ప్రకారం ఈ అద్దం చాలా శక్తివంతమైన చిహ్నాలలో ఒకటి. ఇది ఇంటికి తగిలించడం వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించదు.

బగువా అద్దం
బగువా అద్దం (pinterest)

Feng shui tips: చైనీస్ భాషలో వాస్తు శాస్త్రాన్ని ఫెంగ్ షూయి అంటారు. నీరు, అగ్ని, భూమి, కలప, లోహాన్ని పంచ భూతాలుగా పరిగణిస్తారు. ఫెంగ్ షూయికి  సంబంధించిన కొన్ని చిట్కాలు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యానికి కారకాలుగా భావిస్తారు.

క్రిస్టల్ బాల్, అక్వేరియం, ఫౌంటెన్, ఫ్లూట్, మాండరిన్ డక్, ఫెంగ్ షుయి కప్ప, లాఫింగ్ బుద్ధ మొదలైన అనేక ఫెంగ్ షూయి వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో ఆనందం, జీవితంలో సానుకూల శక్తిని నింపుతుందని నమ్ముతారు. ఫెంగ్ షుయి ప్రకారం ఇంట్లో బగువా అద్దాన్ని అమర్చడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బాగువా అద్దానికి సంబంధించిన ఫెంగ్ షూయి చిట్కాలను తెలుసుకుందాం.

బాగువా అద్దం అంటే ఏమిటి?

బగువా అద్దం అనేది ఒక ప్రత్యేక రకమైన అద్దం. దీని ఆకారం అష్టభుజి అంటే ఎనిమిది కోణాలతో ఉంటుంది. దీనికి మొత్తం 8 అంచులు ఉన్నాయి. ఈ ఎనిమిది అంచులలో ఒక్కొక్కటి మూడు లైన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని అసంపూర్తిగా, మరికొన్ని పూర్తిగా ఉంటాయి. మొత్తం పంక్తులను యాంగ్ అని, అసంపూర్తిగా ఉన్న కోణాలను యిన్ అని పిలుస్తారు. బగువా అద్దంలో కేంద్రం లేదు. ఫెంగ్ షూయి ప్రకారం బగువా అద్దం ఎరుపు దారంతో కట్టి పడకగది తలుపు వద్ద ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల గదిలోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఇంట్లో పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది.

ఫెంగ్ షూయి ప్రకారం అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో బగువా అద్దం ఒకటి. అయితే ఇది ఇంట్లో పెట్టుకునే సాధారణ అద్దం వంటిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచుకునే అద్దం. చెడు, దుష్టశక్తుల నుంచి రక్షణగా ఉంచడంలో ఈ అద్దం సహాయపడుతుందని ఫెంగ్ షూయి శాస్త్రం చెబుతోంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ అంగుళాల వ్యాసంతో గుండ్రని అద్దం దాని చుట్టూ చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసిన ఫ్రేమ్ అమరుస్తారు. 

బగువా అద్దం అమర్చడం వల్ల ప్రయోజనాలు

బగువా అద్దాన్ని అమర్చడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోయి జీవితంలో సానుకూల శక్తిని నింపుతుందని చెబుతారు.

చెడు శక్తుల నుండి రక్షించడంలో బగువా అద్దం కూడా ప్రయోజనకరంగా పని చేస్తుంది. 

ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉన్నట్లయితే బగువా అద్దాన్ని అమర్చడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు.

ఇది కాకుండా ఫెంగ్ షుయిలో ప్రధాన ద్వారం వద్ద బగువా అద్దాన్ని అమర్చడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద బగువా అద్దం అమర్చడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీన్ని ప్రధాన ద్వారం మధ్యలో అమర్చాలి.

చెడు దృష్టిని తొలగిస్తూ ఇంటికి అదృష్టాన్ని ఆహ్వానించేందుకు ఈ అద్దం చక్కగా సహాయపడుతుంది. అయితే ఈ అద్దం పెట్టుకునేటప్పుడు దాని మీద పడే కాంతి ఎదురుగా ఉన్న ఇంట్లోకి పడకూడదు. అలా ఉంటే అది మంచికి బదులు చెడు చేస్తుంది. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్