Mercury transit: చంద్రుడి రాశిలో బుధుడి ప్రవేశం, వీరికి అప్పుల నుంచి విముక్తి, అన్నింటా విజయం-mercury transit in moon sign from 22nd august these three zodiac sings get everything will be accomplished ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: చంద్రుడి రాశిలో బుధుడి ప్రవేశం, వీరికి అప్పుల నుంచి విముక్తి, అన్నింటా విజయం

Mercury transit: చంద్రుడి రాశిలో బుధుడి ప్రవేశం, వీరికి అప్పుల నుంచి విముక్తి, అన్నింటా విజయం

Gunti Soundarya HT Telugu
Aug 16, 2024 10:19 AM IST

Mercury transit: గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు ఆగస్ట్ నెలలో మూడు సార్లు తన కదలికలు మార్చుకోబోతున్నాడు. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల మూడు రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.

చంద్రుడి రాశిలో బుధుడి సంచారం
చంద్రుడి రాశిలో బుధుడి సంచారం

Mercury transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఒక రాశి నుండి మరొక రాశికి నిర్దిష్ట వ్యవధిలో సంచరిస్తాడు. బుధుడు, తెలివితేటలు, జ్ఞానం, వ్యాపారానికి కారకుడు. గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. బుధుడు ప్రస్తుతం సింహ రాశిలో కూర్చున్నాడు. ఆగస్ట్ 5 నుంచి తిరోగమన దశలో సంచరిస్తూ ఆగస్ట్ 12న అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు.

ఈ విధంగా ఆగస్ట్ 22న ఉదయం 06:22 గంటలకు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత సెప్టెంబర్ 4న బుధుడు మళ్లీ సింహ రాశిలో సంచరిస్తాడు. సెప్టెంబర్ 23న బుధుడు సింహ రాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా బుధుడు ఆగస్ట్ నెలలో మూడుసార్లు తన రాశిని మారుస్తాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చల్లని మనసు, భావోద్వేగాలు వంటి వాటికి చంద్రుడు కారకుడిగా చెప్తారు. కర్కాటక రాశిలో బుధుడి సంచారం మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది కానీ కొన్ని రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశిలో బుధుడు సంచరించడం ఏ రాశి వారికి ప్రయోజనకరమో తెలుసుకోండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి బుధ సంచారము వలన కొన్ని శుభవార్తలు అందబోతున్నాయి. మీరు ఉద్యోగ వృత్తిలో మంచి ఎంపికలను పొందవచ్చు. మీరు ఇంటర్వ్యూకు హాజరు కాబోతున్నట్లయితే విజయం సాధిస్తారు. ఈ కాలం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తారు. ఈ కాలంలో మీరు మీ పనిలో విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బుధ సంచారము వలన మంచి రాబడి లభిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడి నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు. మీరు అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. కొత్త వనరుల నుండి ధనం వస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అప్పులు తీర్చడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఈ సమయంలో పురోగతి ఆశించిన విధంగా ఉండటం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి

బుధ సంచారము కుంభ రాశి వారి జీవితాలలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కాలం మీ జీవితంలో సానుకూల మార్పులతో పాటు మంచి ఫలితాలను తెస్తుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిలో మీరు విజయం సాధిస్తారు. మీరు ఆకస్మిక ధనలాభంతో పాటు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఖర్చులు తగ్గుతాయి. రానున్న 14 రోజులు వీరికి రాజులాంటి జీవితం లభించబోతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.