Weekly Horoscope: ఈ వారం వారఫలాలు: ఈ రాశి వారి చిరకాల కోరిక నెరవేరే సమయం ఇది
15 December 2024, 9:02 IST
- Weekly Horoscope Telugu: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకూ ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకూ
రాశిఫలాలు (వారఫలాలు) 15.12.2024 నుంచి 21.12.2024 వరకు
లేటెస్ట్ ఫోటోలు
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
మాసం: మార్గశిరము, తిథి : మార్గశిర శు. పౌర్ణమి నుండి మార్గశిర కృ. షష్టి వరకు
మేషం:
భూసమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. శుభకార్యాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవహారాలలో విజయం దక్కుతుంది. నిరుద్యోగులకు శుభవార్త వినిపిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు పొందే సమయం. వారం చివరిలో వివాదాలు, అనారోగ్యం. దూరప్రయాణాలు. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.
వృషభం:
చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. చాలా రోజులుగా పడుతున్న శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనసౌఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలలో ముందడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. వృథా ఖర్చులు, కుటుంబసమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిధునం:
సంఘంలో ఎనలేని గౌరవం దక్కడంతో పాటు కొత్త పనులు ప్రారంభిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట దక్కే సమయం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు, ఆరోగ్యభంగం కలిగే అవకాశం ఉంది. గులాబీ, నేరేడు రంగులు. దుర్గాదేవిని స్మరించండి.
కర్కాటకం:
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు పొందడంతో పాటు నూతనోత్సాహం కలుగుతుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కనున్నాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు. రుణాలు ఎక్కువగా చేస్తారు. ఆకుపచ్చ, నీలం రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
సింహం:
పనుల్లో విజయం సాధిస్తారు. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధించగలరు. చిరకాల కోరిక నెరవేరే సమయం ఇధి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. నీలం, పసుపు రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.
కన్య:
ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు తలపెడతారు. వారం మధ్యలో అందే సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలను మీ అంచనాలకు తగినంతగా విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో చివరిలో దూరప్రయాణాలు, మానసిక అశాంతి. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు తొలగిపోతాయి. గులాబీ, తెలుపు రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.
తుల:
అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహనయోగం ఉంటుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలోచనలను అమలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు కలుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం నిరాశకు గురి చేస్తుంది. దూరప్రయాణాలు, పసుపు, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం:
నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఇంతకాలంగా పడిన శ్రమకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు, తీర్ధయాత్రలు, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో వివాదాలు, అనారోగ్యం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఎరుపు, నీలం రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు:
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు కలసివస్తాయి. మీ ఊహలు నిజం చేసుకునేందుకు ప్రయత్నించి సఫలీకృతులవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం కలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎరుపు, తెలుపు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.
మకరం:
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని పనులను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించకపోవడంతో నిరాశ ఎదుర్కొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు కలుగుతాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశ తప్పదు. వారం మధ్యలో ఆకస్మిక ధన, వస్తులాభాలు కలుగుతాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం:
నచ్చిన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలపడతారు. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా అనుకూలురుగా మారవచ్చు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళాకారుల యత్నాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వారం చివరిలో దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. గులాబీ, నీలం రంగులు, కనకధారా స్తోత్రాలు పఠించండి.
మీనం:
వ్యవహారాలను చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆస్తుల విషయంలో సమస్యలు తీరే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఊరట చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలుగుతుంది. భూములు, వాహనాల కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను క్రమంగా వృద్ధి చేసుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి గట్టెక్కుతారు. వారం ప్రారంభంలో ఖర్చులు ఎదురవుతాయి. మానసిక అశాంతి, పసుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.