ఆంజనేయుడికి ఇష్టమైన రాశులు.. వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అధికంగా శుభాలు
హనుమంతుడిని పూజించేందుకు మంగళవారం ఉత్తమమైన రోజు. ఆంజనేయుడి ఆశీస్సులు కొన్ని రాశుల వారిపై ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు హనుమాన్ చాలీసాను పఠిస్తే ఆయనను ప్రసన్నం చేసుకోగలరు. శుభప్రదంగా ఉంటుంది.
(1 / 6)
హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల అందరికీ మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల కొన్ని రాశుల వారికి మరింత ఎక్కువ శుభప్రదంగా ఉంటుంది. హనుంతుడికి ఇష్టమైన రాశుల వారు ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చు.
(2 / 6)
హనుమంతుడిని పూజించేందుకు మంగళవారం ప్రాముఖ్యమైన రోజు. స్కంద పురాణం ప్రకారం మంగళవారమే హనుమంతుడు జన్మించారు. ఈరోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం అందరికీ మేలు చేస్తుంది. అయితే, హనుమంతుడికి ఇష్టమైన నాలుగు రాశుల వారికి ఇది మరింత శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏవంటే..
(3 / 6)
మేషం: మేష రాశికి అధిపతి కుజుడు. ప్రతీ మంగళవారం మేషరాశి వారు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఉంది. సకల సమస్యలు తొలగి సంతోషం నెలకొంటుందనే నమ్మకం ఉంది.
(4 / 6)
సింహం: సింహరాశికి సూర్యుడు అధిపతి. హనుమంతుడికి సూర్యుడిని గురువుగా భావిస్తారు. సింహరాశి వారిపై ఆంజనేయుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వీరు ఆంజనేయుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఉంది.
(5 / 6)
వృశ్చికం: వృశ్చిక రాశికి కూడా కుజుడే అధిపతి. ఆంజనేయుడి ఆశీస్సులు.. వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ప్రతీ మంగళవారం వీరు ఆంజనేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
(6 / 6)
కుంభరాశి: కుంభరాశికి అధిపతి శనిదేవుడు. కుంభ రాశి కూడా హనుమంతుడికి ప్రీతిపాత్రమైనది. వీరికి ఆయన అండగా ఉంటారు. ఈ రాశి వారు ఆంజనేయుడికి ప్రతీ మంగళవారం పూజలు చేస్తే శుభప్రదంగా ఉంటుందనే నమ్మకం ఉంది. హనుమంతుడిని ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయనే విశ్వాసం ఉంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. ఏవైనా సందేహాలు, వ్యక్తిగత ప్రభావాల గురించి తెలుసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు