Emerald Stone: బుధవారం ఈ రత్నాన్ని ధరిస్తే డబ్బు కొరత తీరుతుంది
16 December 2023, 7:00 IST
- Emerald stone: జీవితంలో కష్టాలు తొలగిపోయి డబ్బు కొరత తీరాలని అనుకుంటే ఈ ఆకుపచ్చ రంగు రత్నం ధరిస్తే మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
ఎమరాల్డ్ రత్నం ధరిస్తే కలిగే ప్రయోజనాలు
Emerald stone: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని సంపద కలిగిన గ్రహంగా భావిస్తారు. మేధస్సు, ఏకాగ్రత, కమ్యూనికేషన్, జ్ఞాపకశక్తి, మానసిక సామర్థ్యం, వ్యాపారానికి బుధుడు సూచిక. జాతకంలో బుధ గ్రహం బలమైన స్థానం ఉంటే ఆ వ్యక్తికి అన్ని పనుల్లో మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతారు. తెలివితేటలు, నైపుణ్యం, విచక్షణ కారణంగా ఒక వ్యక్తి విజయాన్ని అందుకుంటాడు. జీవితంలో పురోగతి సాధిస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
ఇలాంటి వాళ్ళు సమాజంలో కీర్తిని పెంచుకుంటారు. జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి వ్యక్తులు తమ అదృష్టాన్ని మరింత పెంచుకునేందుకు ఎమరాల్డ్ రత్నాన్ని ధరించడం మంచిది. ఇది మీ పరిస్థితులకి మరింత బలం చేకూరుస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రత్నం ధరిస్తే అందంగా ఉండటమే కాదు అదృష్టం మీ వెంటే ఉంటుంది. అయితే ఎమరాల్డ్ ధరించే ముందు కొన్ని నియమాల గురించి తెలుసుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది. లేదంటే మీరు లాభం కంటే నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది.
ఎమరాల్డ్ రత్నం ధరించేందుకు నియమాలు
కొంతమంది అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని ఎమరాల్డ్ రత్నం ఉన్న ఉంగరం ధరిస్తారు. కానీ అటువంటివి పెట్టుకునే ముందు జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ రత్నాన్ని గంగాజలం, పచ్చి ఆవు పాల మిశ్రమంలో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ధరించాలి. ఈ రత్నాన్ని వెండి లేదా బంగారు ఉంగరంలో ధరించడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. శాస్త్రం ప్రకారం ఎమరాల్డ్ రత్నంతో ముత్యాలు, పగడపు రత్నాలు ధరించకూడదు.
ఎమరాల్డ్ తో డైమండ్ , ఓపల్ ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధవారం రోజు ఎమరాల్డ్ రత్నం ధరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆష్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రం కలిగిన వాళ్ళు ఎమరాల్డ్ ధరించవచ్చు. ఆకుపచ్చ రంగు రాయి ఉంగరం ఎప్పుడు చిటికెన వేలికి ధరించడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఎమరాల్డ్ రత్నం ధరించడం వల్ల ప్రయోజనాలు
ఎమరాల్డ్ రత్నం ధరించడం వల్ల మీ జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుంచి బయట పడొచ్చు. శత్రువులని వదిలించుకోవచ్చు. పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. దీన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
ఎమరాల్డ్ ధరించడం వల్ల సదరు వ్యక్తి తెలివితేటలు మెరుగ్గా ఉంటాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార అవకాశాలు వస్తాయి. ఎదుటి వారికి మీ మాటలు చాలా మధురంగా అనిపిస్తాయి. సంబంధాల్లో ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. చర్మ వ్యాధులు దూరమవుతాయి. ఎమరాల్డ్ ధరించడం వల్ల ఆ వ్యక్తి ఆర్థికంగా పురోగతి సాధిస్తాడు. వ్యాపారస్తుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. అత్యంత విలువైన రత్నాలలో ఇదీ ఒకటి.
టాపిక్