Venus nakshtra transit: భరణి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి వరం లాంటి సమయం, వ్యాపారులకు లాభాలు
06 May 2024, 10:50 IST
- Venus nakshtra transit: సంపదను ప్రసాదించే శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి వరం లాంటి సమయంగా మారనుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
శుక్రుడి నక్షత్ర మార్పు
Venus nakshtra transit: గ్రహాల గమనానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇవి అన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావాలను ఇస్తాయి. శుభకరమైన గ్రహంగా భావించే శుక్రుడు మే 6వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు.
హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో భరణి రెండవ నక్షత్రం. ఈ నక్షత్రాన్ని శుక్రుడు పాలిస్తాడు. భరణి నక్షత్రం కింద జన్మించిన వారికి కళలు, అందం, ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆసక్తిగా ఉంటారు. శుక్రుడి అనుగ్రహంతో ఆయా రంగాలలో అభివృద్ధి పొందుతారు. నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు.
భరణి నక్షత్రం ప్రాముఖ్యత
భరణి నక్షత్రంలో శుక్రుడు ఉన్నప్పుడు వ్యక్తిగత, వృత్తి రంగంలో బలమైన సంబంధాలు కలిగి ఉంటాయి. తమ ప్రియమైన వారి పట్ల విధేయత, భక్తి భావం దృఢం ఉంటాయి. ఎంతటి శ్రమ కలిగినప్పటికీ కష్టపడి పని చేస్తారు. ఇతరులకు సహాయం చేసేందుకు అందరికంటే ముందుంటారు. సాయం అందించే విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. శుక్రుడు భరణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారం, ఫైనాన్స్ లో పని చేస్తున్న వారికి విజయం వరిస్తుంది. కష్టసమయాల్లో సమయస్పూర్తిగా వ్యవహరిస్తారు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. భరణిలో శుక్రుడు ఉన్నప్పుడు బలమైన విధేయత భక్తి భావన కారణంగా సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. గత బాధలను తట్టుకునే ధోరణి ఉంటుంది.
శుక్రుడి ప్రాధాన్యత
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందం, వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, కామం, ఫ్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికే సంకేత గ్రహంగా పరిగణిస్తారు. వృషభ, తుల రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తాడు. మీనరాశి ఉన్నత రాశి అయితే కన్యా రాశి బలహీనరాశి. శుక్రుడు ఈరోజు భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి భవితవ్యం మారిపోతుంది. శుక్రుడు నక్షత్రాన్ని మార్చడం వల్ల ఏయే రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు మేష రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఈ మాసం లావాదేవీలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
శుక్రుడి అనుగ్రహంతో ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మిథున రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంతో సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. లావాదేవీలు నిర్వహించేముందు కొంచెం ఆలోచించి చేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సింహ రాశి
లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహ రాశి వారు ప్రతీ పనులో విజయం సాధిస్తారు. కొత్త ఇల్లు, ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారానికి ఈ సమయం చాలా శుభదాయకంగా ఉంటుంది. లాభం ఉంటుంది కానీ ఈ సంవత్సరం మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. లావాదేవీలు చేయాలని అనుకుంటే ఈ సమయం అనుకూలమైనది.
కన్యా రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. ఇన్వెస్ట్ చేసేందుకు ఈ సమయం మంచిది. అయితే ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయం వ్యాపార వర్గాల వారికి వరం కంటే తక్కువ ఏమీ కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనడానికి అనుకూలమైన సమయం.