Saturn transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి అదృష్టం, ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ-saturn nakshatra movement will change on may 12th these zodiac signs life become like king ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి అదృష్టం, ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ

Saturn transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి అదృష్టం, ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ

Gunti Soundarya HT Telugu
May 04, 2024 10:22 AM IST

Saturn transit: శని నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సంతోషంగా జీవిస్తారు.

శని నక్షత్ర మార్పు
శని నక్షత్ర మార్పు

Saturn transit: శని శుభస్థితిలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టం ప్రకాశిస్తుంది. ఏప్రిల్ 6వ తేదీ శని పూర్వ భాద్రపద నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశించాడు. మే 12న శని దేవుడు పూర్వ భాద్రపద నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ శని ఆగస్టు 18 వరకు కూర్చుంటాడు. శని నక్షత్రం మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.

ఇటువంటి పరిస్థితుల్లో శని నక్షత్రం మార్పు కదలిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. పూర్వ భాద్రపద నక్షత్రం రెండవ పాదంలో శని ప్రవేశించడం వల్ల ఏ రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి

శని నక్షత్రం మార్పు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో స్నేహితుడు సహాయంతో మార్పుకు అవకాశం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకడమిక్ పనులు విజయం సాధిస్తారు. నిలిచిపోయిన ధనాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరిస్థితి బలపడుతుంది. తల్లిదండ్రులు అండగా నిలుస్తారు. 

మిథున రాశి

శని నక్షత్రం కదలిక మిథున రాశి వారికి డబ్బు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యా మేధోపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను అందిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆదాయ అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంది. వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. లాభావకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది.

సింహ రాశి

శని గమనం సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వాహన సుఖం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. లాభసాటి అవకాశాలు కలుగుతాయి. తోబుట్టువులతో కలిసిపోతారు. స్నేహితుడి సహాయంతో ధనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పూర్వికుల ఆస్తి నుంచి డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది. జాబ్ లొకేషన్ లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. 

కన్యా రాశి

శని మారుతున్న కదలిక నుండి కన్యా రాశి వారికి ప్రయోజనం ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి శుభవార్తలు అందుతాయి. ఆస్తిలో ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉంటే అవి మీకు ఈ సమయంలో కలిసి వస్తాయి. పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఖర్చులు, కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఆదాయం వృద్ధి ఉంటుంది. పరిశోధనల కోసం విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ మార్పునకు అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి

శని సంచారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది.

ధనుస్సు రాశి

ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. పని పరిధి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి. మేధోపరమైన  పని నుండి డబ్బు సంపాదించేందుకు అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి 

శని సంచారం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబం, పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. శని అనుగ్రహంతో సమాజంలో మీ స్థానం, ప్రతిష్ట పెరుగుతాయి. వ్యాపార విషయాల్లో లాభాలు కలుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. 

 

WhatsApp channel