నవంబర్ 10, నేటి రాశి ఫలాలు- రాజకీయనాయకులకు, పారిశ్రామికవేత్తలకు కలిసి వచ్చే రోజు
10 November 2024, 0:01 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 10.11.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నవంబర్ 10 నేటి రాశి ఫలాలు
రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 10-11-2024
వారం: ఆదివారం, మాసం: కార్తీకము,
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
మేషం
విజయవంతమైన రోజు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశం. క్రొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం తగవచ్చు. రాబడి బాగుంటుంది. వ్యాపారులకు లాభ సూచన. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు అందివస్తాయి. నూతన కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు వస్తాయి.
వృషభం
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. రాజకీయ వేత్తలకు ఆశలు చిగురిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు మంచి ప్రతిభ చూపుతారు.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు ఆలోచనలు కలసి వస్తాయి. స్థిరాస్తి అగ్రిమెంట్లు, ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కళాకారులకు అనుకూలమైన రోజు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఎవరి సాయమూ లేకుండానే ముఖ్యమైన పనులు నిర్వర్తిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. పారిశ్రామిక వేత్తలకు, రాజకీయ నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం
ఇబ్బందికరంగా ఉంటుంది. బాధ్యతలు భారం అవుతాయి. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరదు. వ్యాపార కార్యకలాపాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళా, క్రీడారంగాల్లోని వారి అంచనాలు తప్పుతాయి. పనులను వాయిదా వేయవలసి వస్తుంది.
సింహం
పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అవసరానికి సొమ్ము చేతికందుతుంది. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తారు.
కన్య
ఊహించని విధంగా కలిసివస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని వారికి ఊహించని విధంగా అవకాశాలు కలసివస్తాయి. క్రీడాకారులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.
తుల
పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రత్యర్థులు కలసివస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు అనుకోని విధంగా కలసివస్తుంది.
వృశ్చికం
అనుకున్నది జరుగుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. రాదనుకున్న సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం. శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ చేస్తారు. నూతనంగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆటంకాలు తొలగుతాయి. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ధనుస్సు
మీ ప్రతిభను నలుగురూ గుర్తిస్తారు. బంధుమిత్రులనుంచి సాయం అందుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కోరుకుంటున్న మార్పులు జరుగుతాయి. వ్యాపారులకు అంచనాలమేరకు ఆదాయం లభిస్తుంది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం
ప్రోత్సాహకరంగా ఉంటుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకున్న విధంగా ధనం సమకూరుతుంది. ఉద్యోగులు విధినిర్వహణలో శ్రద్ధ చూపాలి. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన రోజు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయనాయకులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
కుంభం
కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులు అధిక లాభాలు గడిస్తారు. కొత్త కాంట్రాక్టులు చేసుకుంటారు. కుటుంబంలోఆదరణ పెరుగుతుంది. రాజకీయనాయకులకు, పారిశ్రామిక వేత్తలకు అనుకోని గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకు తగిన ఫలితం లభిస్తుంది.
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. ప్రముఖులు నుంచి కీలక సందేశం. ఊహించని రీతిలో రాబడి దక్కుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతా యి. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. బంధువులు మరిన్ని బాధ్యతలు పెంచుతారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు విజయపథంలో సాగుతారు