ఈ వారం వారఫలాలు- ఆకస్మిక ధనలాభం, ఉద్యోగులకు పదోన్నతులు, కానీ కాస్త వృథా ఖర్చులు
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 3 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
రాశిఫలాలు(వార ఫలాలు) 03-11-2024 నుంచి 09-11-2024 వరకు
మాసం: కార్తీకము, ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీక్రోధినామ
మేషం
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, బంగారు రంగులు, హనుమాన్ చాలీసా పఠించండి.
వృషభం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆశించిన రాబడి ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. నలుపు, లేత గులాబీ రంగులు, కనకధారా స్తోత్రాలు పఠించండి.
మిథునం
ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, ఈశ్వరారాధన మంచిది.
కర్కాటకం
ఈ వారం వారఫలాల ప్రకారం కర్కాటక రాశి వారి పనులు ముందుకు సాగవు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.
సింహం
పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.
కన్య
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ధనలబ్ధి. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.
తుల
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు, లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవార్డులు రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు రంగులు, విష్ణు సహస్రనామాలు పఠించండి.
ధనుస్సు
ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి రాగలవు. పలుకుబడి కలిగిన వారి నుంచి సహకారం. వ్యాపారాలు అభివృద్ధి వైపు పయనిస్తాయి. ఉద్యోగులు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. రుణయత్నాలు. పసుపు, లేత గులాబీ రంగులు, హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మకరం
చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. పోటీపరీక్షల్లో విజయం. విద్యార్థులకు కలసివచ్చే సమయం. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు, అవార్డులు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడు రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం
ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో గందరగోళం తొలగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యావకాశాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. పసుపు, తెలుపు రంగులు, శివపంచాక్షరి పఠించండి.
మీనం
కొత్త వ్యూహాలు, నిర్ణయాలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, అంగారకస్తోత్రాలు పఠించండి.
అందించిన వారు: అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ