Elinati shani: 2025లో ఈ రాశిపై ఏలినాటి శని ప్రారంభం- ఏడున్నర సంవత్సరాలు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి
Elinati shani: కొత్త ఏడాది అనేక గ్రహాలు రాశులను మారుస్తాయి. వాటిలో ముఖ్యమైనది శని. 2025 లో శని కుంభ రాశి నుంచి మీన రాశికి మారుతుంది. దీని వల్ల ఏలినాటి శని ప్రభావం మేష రాశి వారి మీద ఎక్కువగా కనిపించబోతుంది.
నవంబర్ 15న కర్మను ఇచ్చే శనిగ్రహం తన కదలికను మార్చుకోబోతోంది. శని గ్రహం ఇప్పటివరకు తిరోగమనంలో ఉంది. ఇప్పుడు అది ప్రత్యక్షంగా మారుతుంది. శని ప్రత్యక్షంగా మారడం వల్ల అనేక రాశిచక్రాలు ప్రభావితమవుతాయి.
అయితే వచ్చే ఏడాది 2025లో శనిగ్రహం తన రాశిచక్రం అయిన కుంభ రాశి నుండి మీన రాశిలోకి వెళ్లబోతుంది. ఈ రాశికి అధిపతి బృహస్పతి. మీన రాశిలో శని సంచారం అనేక రాశుల సమీకరణాలను మారుస్తుంది. దీని వల్ల ఏలినాటి, అర్థాష్టమ శని ఉండే రాశులు మారతాయి. ఇది అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. 2025 సంవత్సరంలో ఏయే రాశులపై ఏలినాటి శని ప్రారంభమవుతుంది? వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది తెలుసుకుందాం.
కుంభ రాశిపై ప్రభావం
కుంభ రాశి నుంచి శని బయటకు వెళ్లిపోవడంతో వారికి మంచి రోజులు ప్రారంభంఅవుతాయి. మానసిక వేదన నుంచి ఉపశమనం కలుగుతుంది. గౌరవం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. భూమి, భవనం, ఆస్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కోర్టు కేసుల నుంచి బయట పడతారు.
మేష రాశిపై ప్రభావం
2025లో ఏలినాటి శని ప్రభావం మేష రాశిలో ప్రారంభమై మకర రాశిలో ముగుస్తుంది. మకర రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శని ఏడున్నర సంవత్సరాలు మేష రాశిలో ఉంటాడు. ఇందులో మూడు దశలు ఉన్నాయి. ఈ మూడు దశల్లో శని ప్రభావం భిన్నంగా ఉంటుంది. మేష రాశి వారు ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కొన్ని పెద్ద వ్యాధులు కూడా రావచ్చు.
అందుచేత ఏలినాటి శని రెండో దశలో మేష రాశి వారికి సమయం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి వారు మానసికంగా కూడా ఆందోళన చెందుతారు. పేదలకు సహాయం చేయాలి. శనిగ్రహానికి పరిహారాలు చేయాలి. 2025లో కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు శని ప్రభావం నుండి ఉపశమనం పొందుతారు.
మీన రాశి
శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభమవుతుంది. ఈ దశ అత్యంత సమస్యాత్మకంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రెండున్నర సంవత్సరాలు మీన రాశి వారికి కష్టాలు అధికంగా ఉండబోతున్నాయి.
ధనుస్సు, సింహ రాశుల పరిస్థితి ఏంటంటే
మీన రాశిలో శని సంచారం వల్ల అర్థాష్టమ శని ధనుస్సు, సింహ రాశుల మీద ఉంటుంది. ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. 2027 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.