తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు : ఏలినాటి శనిప్రభావంతో.. అనారోగ్య సమస్యలు ఎక్కువైతాయి..

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు : ఏలినాటి శనిప్రభావంతో.. అనారోగ్య సమస్యలు ఎక్కువైతాయి..

23 September 2022, 5:00 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 23వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (23-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు- సరైన సమయంలో ధన లాభం, అన్ని కష్టాలు దూరం..

Dec 24, 2024, 06:00 AM

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - దరఖాస్తుదారుడి వద్ద ఉండాల్సిన వివరాలు, పత్రాలివే..!

Dec 24, 2024, 05:02 AM

ఆ సైటులో ఈ మూడు పదాల వీడియోల కోసం ఎక్కువ సెర్చ్ చేశారట జనాలు.. లెస్బియన్ ఇందులో లేదు!

Dec 23, 2024, 10:42 PM

కేతువు సంచారంతో కొత్త ఏడాదిలో ఈ రాశులవారికి మంచి జరగనుంది.. పని ప్రదేశంలో గుర్తింపు!

Dec 23, 2024, 08:57 PM

Building Permissions : భవన నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఐదంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు

Dec 23, 2024, 06:59 PM

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ

Dec 23, 2024, 05:52 PM

మేషరాశి

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఖర్చులు నియంత్రణలో పెట్టుకోండి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. లక్ష్మీదేవిని పూజించడం, ఆవునేతితో దీపాన్ని వెలిగించడం శుభఫలితాలను కలిగిస్తాయి.

వృషభరాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. తలచిన ప్రతీ పని ఏదో రకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. బంధువులు, మిత్రులతో మాటలు సానుకూలంగా జరుగుతాయి. అనుకూలమైన వార్తలు వింటారు. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసముగా గడపడానికి ప్రయత్నిస్తారు. నూతనంగా మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

మిధునరాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక, మానసిక ఇబ్బందులు చికాకులు ఉంటాయి. బంధువులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణమునందు ఖర్చులు అధికమగుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

కర్కాటకరాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికముగా ఉంటుంది. పనుల్లో అలసత్వం వహిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.

సింహరాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. చికాకులు అధికముగా ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగములో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు మధ్యస్తంగా ఉంటుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిది.

కన్యారాశి

ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ప్రయాణములు అధికమగుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యారాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ధనలాభము కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. సంతానము వలన సంతోషము కలుగుతుంది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల సహాయము పొందుతారు. లలితా సహస్రనామాన్ని చదివి.. ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. పనులలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విజయం సాధిస్తారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికముగా ఉంటుంది. ధనలాభము కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రతీ పనిని చాకచక్యంతో పూర్తి చేస్తారు. సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. ఒత్తిడి అధికముగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేసే ప్రతి పనిని ఆచితూచీ చేయండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం అలాగే ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము ఇది. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిలో సమస్యలు అధికముగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. మీరు పూర్తి చేద్దామనుకున్న పనులకు ఏదో రకంగా ఆటంకం కలుగుతుంది. ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించవలన శుభ ఫలితము కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

తదుపరి వ్యాసం