Today Horoscope : నేటి రాశిఫలాలు : పనులు మీవైనా.. వాటితో ఎదుటి వారు లాభపడటానికి చూస్తారు..-today horoscope in telugu based on career and life for 22nd september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 22nd September 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : పనులు మీవైనా.. వాటితో ఎదుటి వారు లాభపడటానికి చూస్తారు..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 22, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? రోజును ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. సెప్టెంబర్ 22వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (22-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. కొన్ని చికాకులు ఉంటాయి. పనుల్లో అలసత్వం చూపిస్తారు. ఖర్చు అధికముగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభరాశి

ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. భేదాభిప్రాయ సూచనలు అధికముగా ఉన్నాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభవార్తలు వింటారు. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

మిధునరాశి

మీకు ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. పనులలో చికాకులు కలుగుతాయి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ప్రయాణ ఖర్చులు అధికమయ్యే సూచన ఉంది. ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కర్కాటకరాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విశ్రాంతి దొరుకుతుంది. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహరాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యారాశి

ఈరోజు మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శారీరక సౌఖ్యం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అధికమవుతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. శుభ ఫలితాల కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పని పూర్తి చేస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందం సొంతమవుతుంది. ధనలాభము కలుగును. కుటుంబంతో చర్చలకు దూరంగా ఉండండి. సంతానము వలన సంతోషము కలుగుతుంది. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికముగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. పిల్లల వలన చికాకులు పెరుగుతాయి. మీ పనులతో ఎదుటి వారు మన్నన పొందేందుకు ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

ధనూ రాశి

ఈరోజు మీకు చెడు ఫలితాలున్నవి. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. కుటుంబములో చికాకులు ఉంటాయి. శారీరక శ్రమ కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక సౌఖ్యము, ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్యం విషయంలో, కుటుంబ వ్యవహారములలో.. వృత్తి వ్యాపారములలో జాగ్రత్తలు వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్