Lucky Star: ఈ నక్ష్రతంలో జన్మించిన వాళ్లు అదృష్టవంతులు.. చాలా ఫేమస్ అవుతారు!
12 December 2024, 10:35 IST
- Lucky Star: జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఒక్కో నక్షత్రంలో పుట్టిన వారు ఒక్కో రకమైన లక్షణాలు, అదృష్టాలను కలిగి ఉంటారు.వాటి ఆధారంగా చూస్తే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లు అదృష్టవంతులు.. చాలా ఫేమస్ అయిపోతారు. ఆ నక్షత్రం ఏంటో తెలుసుకుందాం.
ఈ నక్ష్రతంలో జన్మించిన వాళ్లు అదృష్టవంతులు
నక్షత్రాలను బట్టి వ్యక్తుల లక్షణాలు, స్వభావాలతో పాటు వారికి కలిగే శుభ, అశుభ ఫలితాలు, అదృష్టం, దురద్రుష్టం వంటి వాటిని అంచనా వేయగలిగే శక్తి జ్యోతిష్య శాస్త్రానికి ఉంది. దాన్ని బట్టి వ్యక్తి జీవితంలో కలిగే కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు సాధారణుల కంటే భిన్నమైన ప్రత్యేకతలను పొందుతారు. అస్ట్రాలజీ లెక్కల ప్రకారం ఓ నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యేక ఆకర్షణా శక్తి ఉంటుంది. వారు చాలా ఫేమస్ అవుతారు.
లేటెస్ట్ ఫోటోలు
నక్ష్రతాలన్నింటిలో విశాఖ నక్షత్రం చాలా ముఖ్యమైనది. బృహస్పతి పాలించే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి శక్తి, తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఆశాజనకమైన స్వభావం కలిగి ఉంటారు. సంప్రదాయాలను గౌరవిస్తారు కానీ మూఢనమ్మకాలను ద్వేషిస్తారు. కృషి, సంకల్పంతో తమ లక్ష్యాలను సాధించడానికి ముందుకు సాగుతారు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల స్వభావం, వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిలేషన్‌షిప్స్ విషయంలో..
విశాఖ నక్షత్రంలో జన్మించిన పురుషులు తమ తల్లితో మంచి అనుబంధం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తి స్వావలంబన కలిగి ఎంటారు. వీరి వైవాహిక జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు తమ భర్తలను చాలా ప్రేమగా చూసుకుంటారు. అత్తమామాలతో ఇతర కుటుంబ సభ్యులతో మంచి సంబంధం కొనసాగిస్తారు. కుటుంబానికి విలువ ఇస్తారు.
కెరీర్ విషయంలో..
విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు చాలా తెలివైన వారు. మాట్లాడటంలో వీరి ప్రావిణ్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే ఖర్చు విషయంలో వీరు ఏమాత్రం వెనకడుగు వేయరు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ప్రభుత్య ఉద్యోగాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వ్యాపారం చేయాలనే కోరిక కూడా వీరికి ఎక్కువే. ఈ నక్ష్రతంలో జన్మించిన వారు మీడియా, ఫ్యాషన్ డిజైనింగ్, రేడియో, ట్రావెలింగ్ వంటి క్రియేటివ్ రంగాల్లో పనిచేసేందుకు ఇష్టపడతారు. రాజకీయాలు, బ్యాంకింగ్ రంగాలు కూడా వీరికి అనుకూలంగానే ఉంటాయి. ఏ పని చేసినా న్యాయంగా, నిజాయితీగా చేయడం వీరి ప్రత్యేకత.
ఆరోగ్యం విషయంలో..
విశాఖ నక్ష్రతంలో జన్మించిన వారికి వయసు పెరిగే కొద్దీ శ్వాసకోశ సమస్యలు రావచ్చు. మహిళలు సాధారణంగా బలహీనతతో ఇబ్బంది పడతారు. అలాగే మూత్రపిండాల సమస్యలు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టచ్చు. పురుషులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాలి.
విశాఖ నక్షత్రం వారు మరిన్ని మంచి ఫలితాల కోసం చేయాల్సినవి:
విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు విష్ణుమూర్తిని ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుంది. పూజా సమయంలో పప్పులను నైవేద్యంగా సమర్పించాలి.రావి ఆకుపై స్వస్తిక్ చిహ్నాన్ని రాసుకుని విష్ణుమూర్తి పాదాల దగ్గర సమర్పించండి.