తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Struggle Life: ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి, జీవితంలో ఎంతటి సవాళ్ళు అయినా మిమ్మల్ని ఏం చేయలేవు

Struggle life: ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి, జీవితంలో ఎంతటి సవాళ్ళు అయినా మిమ్మల్ని ఏం చేయలేవు

Gunti Soundarya HT Telugu

02 September 2024, 15:00 IST

google News
    • Struggle life: జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొనేందనుకు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకూడదు. మీలో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ఈ సంస్కృత పదాలు ఎప్పుడూ మనసులో మననం చేసుకుంటూ ఉండండి. కష్టాలు కూడా దూది పింజల్లా కనిపిస్తాయి. 
జీవితం అంటే ఏంటో తెలియజేసే సంస్కృత పదాలు ఇవి
జీవితం అంటే ఏంటో తెలియజేసే సంస్కృత పదాలు ఇవి (pixabay)

జీవితం అంటే ఏంటో తెలియజేసే సంస్కృత పదాలు ఇవి

Struggle life: మనిషి జీవితం ఎప్పుడూ పూల పాన్పుగా ఉండదు. ముళ్ళ బాట కూడా ఉంటుంది. సవాళ్ళు, కష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చిన్న కష్టాన్ని చూసి భయపడి పారిపోతే జీవితంలో ఓడిపోయినట్టే. మనం భరించలేనంత సమస్యలు ఎదురైనప్పుడు అసలు జీవితం ఏంటో తెలుస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

Love Rasis: ఈ రాశుల్లో జన్మించినవారు ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తారు

Dec 14, 2024, 06:00 AM

ఈ రాశుల వారికి త్వరలో అదృష్ట కాలం.. సంతోషం, విజయాలు, ధనయోగం!

Dec 13, 2024, 10:31 PM

Cars price hike: జనవరి 1 నుంచి ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి..

Dec 13, 2024, 09:42 PM

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు - అంతా యాప్ లోనే..!

Dec 13, 2024, 09:11 PM

Toyota Urban Cruiser EV: ఈవీ రేసులో కొత్త ప్లేయర్.. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ

Dec 13, 2024, 09:09 PM

Women Health: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి అవుతుందని అర్థం

Dec 13, 2024, 05:46 PM

జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం కూడా ఉండాలి. అటువంటి ధైర్యాన్ని ఇచ్చే కొన్ని సంస్కృత పదబంధాలు ఉన్నాయి. ఎంతో సింపుల్ గా ఉచ్చరించగలిగే ఈ పదాలు మీకు కష్టకాలంలో ధైర్యాన్ని ఇస్తాయి. వీటిని పఠించడం వల్ల జీవితంలో దేనినైనా సాధించగలను అనే నమ్మకం మీకు ఏర్పడుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ఏంటో మీకు తెలుస్తాయి. ఈ ఐదు శ్లోకాలు మీరు పఠించి చూడండి. జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అనుగచ్చతి ప్రవః

అనుగచ్చతి ప్రవః అంటే ప్రవాహంతో వెళ్ళు అని దీని అర్థం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతిఘటించడం కంటే వాటితో ప్రవహించడం మంచిదని చెప్తుంది. ఇది మీలోని మార్పును సూచిస్తుంది. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, అవి ఎక్కువ రోజులు నిలవలేవు. కొన్ని సార్లు జీవిత ప్రయాణం సానుకూలంగా కూడా మారుతుంది. మీకు కావాల్సిన సంపద, కీర్తి, ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఎదుర్కొనే కొన్ని నష్టాలు చివరికి సంతోషాన్ని మిగులుస్తాయని ఇది సూచిస్తుంది.

ఈశ్వర్ అస్తి మాం శక్తి

ఎంతో సరళమైన అర్థంతో కూడిన మరొక పదబంధం ఇది. దేవుడే నా బలం అనేది దీని అర్థం. కష్టమైన, సులభమైన సమయాల్లో జీవితంలో ప్రయాణించేందుకు మనకు సహాయం చేసే ఏకైక వ్యక్తి భగవంతుడు. మనం ఆయన చేయి విడిచినా దేవుడు మాత్రం మన చేతిని ఎన్నటికీ విడిచిపెట్టడు. సంతోషమైన, దుఃఖమైన మనం దేవుడిని మరువకూడదు. మనుషులు మన చేతిని మధ్యలో వదిలేయవచ్చు కానీ దేవుడు మాత్రం మన వెన్నంటే ఉంటాడు. అందుకే భగవంతుడు మన బలం అని నమ్మడం చాలా అవసరం.

న కదాపి ఖండితః

ఎప్పటికీ విరగలేదు, ఓడిపోలేదు అని దీని అర్థం. ఇది మన అంతర్గత బలాన్ని గుర్తు చేస్తుంది. నేను శక్తివంతుడిని అనే భరోసా ఇస్తుంది. కొన్ని సార్లు దుఃఖం మన శక్తిని క్షీణింప చేస్తుంది. కానీ మనం మన ధైర్యం ఏమిటో తెలుసుకోగలగాలి. మన బలం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు.

అహమ్ అస్మి సంపూర్ణం

జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం సంపూర్ణంగా ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలు మన సంకల్పాన్ని దూరం చేయలేవు. జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు కావలసిందల్లా మనలో ఉన్న శక్తి మాత్రమే అనే విషయం ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. కష్ట సమయంలో మనకు ఎవరో వచ్చి చేయి అందిస్తారని చూడటం కాదు, సాయం చేయలేదని వారిని నిందించడం సబబు కాదు. మనలోని ధైర్యాన్ని మేల్కోలిపే క్షణాలు ఇవి అనే విషయాన్ని మనం గ్రహించాలి. పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగేందుకు ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. దాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు.

యత్ భావో తత్ భవతి

ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు మంచిది కాదు. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. అందుకే మనం ఏమనుకుంటామో అదే జరుగుతుందని ఈ శ్లోకం తెలియజేస్తుంది. అంతా మన మంచికే అనుకోవాలి. ఏదైనా చెడు జరిగినప్పుడు అందులో కూడా మంచి వెతుక్కునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలా ఉన్నప్పుడే జీవితంలో ఏది కష్టమని అనిపించదు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం