Sankashti chaturthi: సంకష్టి చతుర్థి రోజు మీ రాశి ప్రకారం ఈ పనులు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి
27 February 2024, 18:17 IST
- Sankashti chaturthi: కృష్ణ పక్షంలో వచ్చే సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. ఫిబ్రవరి 28న ఈ చతుర్థి వచ్చింది. దీన్ని ద్విజప్రియ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈరోజు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభం జరుగుతుంది.
సంకష్టహర చతుర్థి
Sankashti chaturthi: ఫిబ్రవరి 28న సంకష్టి చతుర్థి జరుపుకోనున్నారు. ఈ సంకష్టి చతుర్థి ద్విజప్రియ చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుని పూజిస్తారు. సంతానం కోసం, బిడ్డ దీర్ఘాయువు కోసం తల్లులు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. విఘ్నాలు తొలగించాలని కోరుకుంటూ వినాయకుడికి తొలి పూజలు అందిస్తారు. వినాయకుని అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో సుఖసంతోషాలకు కుదువ ఉండదు. సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించిన వారి మీద వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది.
పూజా విధానం
ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిలో ఒక చిన్న పీట మీద పసుపు వస్త్రం పరిచి వినాయకుడు ప్రతిమ ఏర్పాటు చేయాలి. పూలు పండ్లు, దుర్వా గడ్డి, నువ్వులతో చేసిన లడ్డూలు, మోదకం మొదలైనవి వినాయకుడికి సమర్పించాలి. తర్వాత ద్విజప్రియ సంకష్ట చతుర్థి కథని చదువుకోవాలి. “ఓం గణపతియే నమః” అనే మంత్రాన్ని పఠించాలి. భక్తిశ్రద్ధలతో పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి.
సంకష్టి చతుర్థి రోజు మీ రాశి చక్రాన్ని బట్టి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలోని బాధలు, డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మీ రాశి ప్రకారం సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేక పరిహారాలు పాటించండి.
ఏయే రాశి జాతకులు ఏం చేయాలి?
మేష రాశి వారు సంకష్టహర చతుర్థి రోజున గణేశుడిని గంగాజలంతో అభిషేకం చేసి ఎర్రచందనం రాయాలి.
వృషభ రాశి జాతకులు గణపతి అనుగ్రహం పొందడానికి “ఓం గణపతియే నమః” అనే మంత్రాన్ని పఠించాలి.
మిథున రాశి వారు ఈ రోజున గణేశుడికి శెనగపిండి లడ్డూలు సమర్పించడం వల్ల వినాయకుడి అనుగ్రహం పొందుతారు.
కర్కాటక రాశి జాతకులు గణేశుడు కోసం సంకష్టహర చతుర్థి రోజున దుర్వా గడ్డిని సమర్పించాలి. గణపయ్య పూజలో దుర్వా గడ్డి లేనిదే పూజా అసంపూర్తిగా భావిస్తారు.
సింహ రాశి జాతకులు గణేశుడికి లడ్డూలు సమర్పించాలి. పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
కన్య రాశి వారి వినాయకుడు అనుగ్రహం పొందడానికి స్వామివారి విగ్రహానికి పసుపు గంధాన్ని రాయాలి.
తులా రాశి వారు పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజున పచ్చిపాలు, గంగాజలంతో వినాయకుడికి అభిషేకం చేసి పూజించాలి.
వృశ్చిక రాశి వారు వినాయకుడికి పెరుగు, తేనెతో అభిషేకం చేసి ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.
ధనస్సు రాశి జాతకులు గణేశుడికి పసుపు రంగు పూలు, బట్టలు సమర్పించాలి.
మకర రాశి వారు వినాయకుడు అనుగ్రహం పొందడం కోసం గణేష్ చాలీసాను పాటించాలి.
కుంభ రాశి వారు ఈ రోజున విఘ్నేశ్వరుడికి మోధకం సమర్పించి, దుర్వా గడ్డితో పూజించాలి.
మీన రాశి జాతకులు సంకష్టి చతుర్థి నాడు బొజ్జ గణపయ్య ఆశీస్సుల కోసం స్వామివారికి ఖీర్ సమర్పించాలి.