Office Problems: ఆఫీసు సమస్యలు నుండి బయటపడాలంటే ఈ పరిహారాలను పాటించండి
11 December 2024, 11:15 IST
- Office Problems: ఒక్కోసారి మనం ఎంత కష్టపడి పనిచేసినా ఇతరులు ఆ క్రెడిట్ ని తీసుకుంటూ ఉంటారు. పైగా ఉద్యోగం చేసే చోట గౌరవం కూడా లభించదు. అలాంటప్పుడు సూర్యుడు, అంగారకుడు బలంగా ఉండాలి. సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి. సూర్యుడు బలహీనంగా ఉంటే కష్టాలు తప్పవు.
Office Problems: ఆఫీసు సమస్యలు నుండి బయటపడాలంటే ఈ పరిహారాలను పాటించండి
ప్రతీ ఒక్కరు కూడా లైఫ్ లో ముందుకు వెళ్లాలని, రోజు రోజుకీ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం ప్రతి రోజూ కూడా కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుందని, ఆశతో పని చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఎంత కష్టపడి పని చేసినా అందులో విజయాన్ని అందుకున్నా కూడా ఆ క్రెడిట్ ని మరొకరు తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరికైనా ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది.
లేటెస్ట్ ఫోటోలు
సూర్యుడు, అంగారకుడి ప్రభావం
మనకి మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహాల ప్రభావం మనపై పడుతుంది. అది మంచైనా, చెడైనా ప్రతి ఒక్కరి జీవితంపై, ఆరోగ్యంపై, ప్రయాణాలపై, డబ్బుపై ఇలా అన్నింటిపై ఈ గ్రహాల ప్రభావం పడుతుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారంపై కూడా ఈ గ్రహాల ప్రభావం పడుతుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే, మీరు కొన్నిటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఒక్కోసారి మనం ఎంత కష్టపడి పనిచేసినా ఇతరులు ఆ క్రెడిట్ ని తీసుకుంటూ ఉంటారు.
పైగా ఉద్యోగం చేసే చోట గౌరవం కూడా లభించదు. అలాంటప్పుడు సూర్యుడు, అంగారకుడు బలంగా ఉండాలి. సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి. సూర్యుడు బలహీనంగా ఉంటే కష్టాలు తప్పవు. ఉద్యోగం చేసే వాళ్లకు కూడా సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే, కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కష్టపడినా ప్రతిఫలం దక్కదు. అలాంటప్పుడు వీటిని అనుసరించడం మంచిది.
సూర్యుడు బలహీనంగా ఉంటే ఈ పరిహారాలను పాటించండి:
సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. ఆదివారం నాడు అస్సలు మాంసాహారాన్ని తీసుకోకూడదు.
ఉప్పును కూడా తీసుకోవడం మంచిది కాదు.
పైన చెప్పినట్లుగా మీరు కష్టాలని ఎదుర్కొంటున్నట్లయితే సూర్యుడికి ఆదివారం నాడు నీళ్ళును సమర్పించండి.
సూర్య మంత్రాలని చదువుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. మీ కష్టాల నుంచి బయటపడొచ్చు. ఇబ్బందులన్నీ తీరిపోతాయి.
సూర్యుడికి సంబంధించి కొన్ని వస్తువులను మీరు దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. కష్టాలు, బాధలు తీరిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు.
అంగారకుడి ప్రభావం:
జ్యోతిష్యం ప్రకారం అంగారకుడు ధైర్యానికి సంకేతం. మీ జాతకంలో అంగారకుడు బలహీనంగా ఉన్నట్లయితే మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది. బలహీనంగా ఉంటారు.
ఈ సమయంలో ఎర్రటి వస్తువులని దానం చేయడం మంచిది.
మంగళవారం నాడు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదువుకోండి.
పగడం పెట్టుకుంటే కూడా మీకు కలిసి వస్తుంది.
ఉద్యోగంలో మీకు క్రెడిట్ రాకపోతున్నట్లయితే రాహువు, కేతువు ప్రభావం కూడా ఉంటుంది.
రాహువు, కేతువు బలహీనంగా ఉంటే కూడా సమస్యలు వస్తాయి. గణేశుడుని ఆరాధిస్తే కూడా రాహువు కేతువు బలంగా ఉంటాయి.