తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: టైం వచ్చేసింది.. నెల రోజుల పాటు ఈ రాశుల వారిని ఓడించే వాడే ఉండడు!

Sun Transit: టైం వచ్చేసింది.. నెల రోజుల పాటు ఈ రాశుల వారిని ఓడించే వాడే ఉండడు!

Ramya Sri Marka HT Telugu

15 December 2024, 10:36 IST

google News
  • Sun Transit: ఇవాళ రాత్రి సూర్యుని ప్రధాన రాశిచక్ర మార్పు జరగబోతోంది. డిసెంబర్ 15 ఆదివారం రాత్రి 10.19 గంటలకు సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మూడు రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. అన్నింటా విజయం, ధనలాభమే. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.

ధనస్సు రాశిలోకి సూర్యుడు
ధనస్సు రాశిలోకి సూర్యుడు

ధనస్సు రాశిలోకి సూర్యుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. అతను నెలకొకసారి తన స్థానాన్ని మార్చగలడు. సూర్యభగవానుడి సంచారం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. తొమ్మిది గ్రహాలలో సూర్యభగవానుడు అత్యంత శక్తివంతమైన గ్రహం. అతను సింహ రాశికి అధిపతి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు అది అన్ని రాశిచక్ర గుర్తులపై ప్రభావం చూపిస్తుంది. ఈ రాత్రి సూర్యుని యొక్క ప్రధాన రాశిచక్ర మార్పు జరగబోతోంది. డిసెంబర్ 15 ఆదివారం రాత్రి 10.19 గంటలకు సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఏడాది ఇదే సూర్యడి చివరి రాశి మార్పు.

లేటెస్ట్ ఫోటోలు

overthinking zodiac signs: ఈ రాశుల్లో పుట్టిన వారు అతిగా ఆలోచిస్తారట! అది వారికి మంచే చేస్తుందట!

Dec 15, 2024, 11:40 AM

ఈ రాశుల వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది- ధన లాభంతో ఆర్థిక కష్టాలు దూరం..

Dec 15, 2024, 05:33 AM

Purnima Effects: నేడే ఈ ఏడాదిలో చివరి పౌర్ణమి, ఈ రాశుల వారికి లెక్కలేనన్ని శుభాలు కలగడం ఖాయం

Dec 15, 2024, 05:00 AM

రేపటి నుంచి ఈ రాశుల వారికి ఎక్కువగా లక్.. ఆదాయం, గౌరవం పెరుగుతాయి!

Dec 14, 2024, 07:35 PM

Love Zodiac signs: ఈ రాశులు వారు ఎవరినైనా ప్రేమలో పడేస్తారు.. సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు

Dec 14, 2024, 09:13 AM

Dreams Come True: మీ కలలు నిజమవ్వడానికి మీకు సహాయపడే నాలుగు రాశి చిహ్నాలు

Dec 14, 2024, 08:19 AM

ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం గ్రహాలలో పెద్ద మార్పుగా భావిస్తారు. ఎందుకంటే ఈ నెల పాటు సూర్యుని శక్తి బలహీనపడుతుంది. కనుక ఈ నెలరోజుల పాటు సూర్యుడు శక్తికి చిహ్నమైన ధనుస్సులో ఉంటాడు. ఈ రోజు నుంచే ఖర్మ రోజులు ప్రారంభమవుతాయి. అంటే ఇవాళ్టి నుంచీ నెల రోజుల పాటు శుభకార్యాలన్నీ ఆగిపోతాయి. నెల రోజుల తర్వాత అంటే వచ్చే సంవత్సరం 2025 లో సూర్యుడు మకర రాశిలో సంచరించే సమయంలో ఈ ఖర్మాలు ముగుస్తాయి. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సూర్యుని ఈ సంచారం వల్ల శుభకార్యాలన్నీ ఆగిపోయినప్పటికీ కొన్ని రాశుల వారికి శుభ పరిమాణాలను తెచ్చిపెట్టనుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.

మేష రాశి :
సూర్యభగవానుని రాశిచక్రం మార్పు వల్ల మేష రాశి వారు ప్రయోజనం పొందుతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే సమయం ఆసన్నమైంది. అయితే ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదని గుర్తుంచుకోండి. కొనసాగుతున్న ప్రాజెక్టులో మీ అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. అన్నింటా లాభాలు కనిపిస్తాయి. అనుకుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ నెల రోజుల పాటు సూర్య భగవానుడిని, లక్ష్మీ దేవినీ ఆరాధించడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది.

మీన రాశి:

మీన రాశి వారికి సూర్యుడు పదవ స్థానంలో సంచరించబోతున్నారు, కాబట్టి ఈ రాశివారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. భారీ వ్యయానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తారు. మొత్తం మీద మీరు ప్రయోజనం పొందుతారు. ఖర్మలలో సూర్యదేవుడిని పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం:

సూర్యుని సంచారం వృశ్చిక రాశి వారికి కొత్త శుభవార్తలను తెస్తుంది. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మీరు మీ తండ్రి నుండి ప్రయోజనం పొందుతారు. పూర్వీకుల ఆస్తిలో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. నిరుపేదలకు ఇచ్చే దానం అదృష్టాన్ని పెంచుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఈ నెల రోజుల పాటు సూర్యుడి కాస్త బలహీనంగా ఉంటాడు కనుక శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు మొదలే పెట్టకూడదు. ఖర్మలలో సూర్య భగవానుడి పూజ, జపం, తపస్సు, దానం మొదలైన వాటి ద్వారా జీవితంలోని అన్ని రకాల బాధలను అంతం చేయవచ్చని నమ్ముతారు. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానానికి కూడా విశేష ప్రాముఖ్యత ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం