Somavathi Amavasya: సోమవతి అమావాస్య ఎప్పుడు వచ్చింది? ఈరోజు ఏం చేయాలి? ఈ పరిహారాలను పాటిస్తే మాత్రం దోషాలు తొలగిపోతాయి
21 December 2024, 8:30 IST
- Somavathi Amavasya: సోమవతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. సోమవారం వచ్చే అమావాస్య కారణంగా దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, దానం చేసి, నైవేద్యాలని సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు
somvati amavasya 2024: సోమవతి అమావాస్య స్నానాల ప్రత్యేకత ఏంటి?
సోమవతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. సోమవారం వచ్చే అమావాస్య కారణంగా దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, దానం చేసి, నైవేద్యాలని సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు. సోమవతి అమావాస్య కి సంబంధించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
సోమవతి అమావాస్య విశిష్టత:
సోమవతి అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అమావాస్యని ఎంతో ప్రత్యేకతగా భావిస్తారు. పితృ దోషాలు ఏమైనా ఉంటే అమావాస్య నాడు తొలగించుకుంటారు. ఎవరి జాతకంలో పితృ దోషం ఉంటుందో వారు అమావాస్య నాడు పరిహారాలను పాటించి పితృదోషం సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది. సోమవతి అమావాస్య నాడు పితృదేవతల్ని సంతోష పెట్టొచ్చు.
సోమవతి అమావాస్య ఎప్పుడు వచ్చింది?
సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తేదీన వచ్చింది. అమావాస్య డిసెంబర్ 30 ఉదయం 4:00 కి మొదలై, 31 డిసెంబర్ ఉదయం 3:56 వరకు ఉంటుంది. సూర్యాస్తమయం సమయం చూడాలి కాబట్టి డిసెంబర్ 30 సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది.
పితృదేవతలను సంతోష పెట్టడానికి సోమవతి అమావాస్య నాడు ఏం చేయాలి?
పితృదేవతలు ప్రశాంతంగా ఉండడానికి, శాంతించడానికి సోమవతి అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది. ఉదయాన్నే నిద్ర లేచి తర్పణాలు ఇవ్వచ్చు. సోమవతి అమావాస్య నాడు పితృదేవతల సంతోషపెట్టడానికి నల్ల నువ్వులు దానం చేయొచ్చు. రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చూస్తే మంచిది.
ఆవాల నూనె లేదా నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలు శాంతిస్తారు. పితృదేవతల అనుగ్రహం కూడా మనకి
కలుగుతుంది.
పిత్ర చాలీసాని పఠిస్తే కూడా పితృదేవతలు సంతోషపడతారు.
బ్రాహ్మణులకు భోజనం పెట్టడం లేదంటే ఏమైనా దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
నల్ల నువ్వులు, పెరుగు, పాలు, దుస్తులు, పండ్లు, పప్పులు వంటివి కూడా ఈరోజు దానం చేయవచ్చు.
సోమవతి అమావాస్య నాడు ఇలా కూడా చేయవచ్చు
సోమవతి అమావాస్య నాడు పితృదేవతలకి నైవేద్యాలు సమర్పిస్తే ఆనందం కలుగుతుంది. జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. అమావాస్యనాడు శివుని మృత్యుంజయ మంత్రం పఠిస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు.
శివుని ప్రతిష్ట ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, డబ్బు రావడానికి కూడా సహాయపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.