Somavathi amavasya: సోమవతి అమావాస్య రోజు వీటిని దానం చేస్తే విజయం, అదృష్టం రెట్టింపు అవుతుంది
Somavathi amavasya: సెప్టెంబర్ 2వ తేదీ సోమవతి అమావాస్య వచ్చింది. పితృ దేవతల ఆరాధనకు ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు చేసే దానం, స్నానానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజు ఈ ఏడింటిలో ఏ ఒక్కటి దానం చేసినా మీకు విజయం, అదృష్టం రెట్టింపు అవుతుంది.
Somavathi amavasya: సోమవతి అమావాస్య చాలా పెద్దదని చెబుతారు. సోమవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఈరోజు స్నానం, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పితృదేవతల ఆరాధనకు, వారికి నైవేద్యాల సమర్పించేందుకు ముఖ్యమైన రోజుగా భావిస్తారు.
సోమవతి అమావాస్య రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. అలాగే ఇవి మీకు విజయం, అదృష్టాన్ని పెంచుకునేందుకు మార్గాలుగా ఉపయోగపడతాయి. అమావాస్య రోజు ఆచరించే ఆచారాలు దైవిక ఆశీర్వాదాలను, పునర్జన్మ చక్రం నుంచి విముక్తిని కల్పిస్తాయని నమ్ముతారు. పూర్వీకుల కోసం ప్రార్థనలు చేస్తూ దానధర్మాలలో పాల్గొంటారు. ఈసారి సెప్టెంబర్ 2న సోమవతి అమావాస్య వచ్చింది. ఈ పవిత్రమైన రోజున తప్పనిసరిగా కొన్ని వస్తువులు దానం చేయడం శ్రేయస్కరం.
అన్నదానం
సోమవతి అమావాస్యనాడు అన్నదానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే గోధుమలు, బియ్యం, పప్పులు వంటి వాటిని నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి దానం చేయవచ్చు.
వస్త్ర దానం
సోమవతి అమావాస్య రోజు కొత్త వస్త్రాలు లేదా తక్కువగా ఉపయోగించిన దుస్తులను దానం చేయడం మంచిది. అది నిరుపేదలకు గౌరవం, సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ కార్యం ఆధ్యాత్మికత పుణ్యాన్ని మీకు ఇస్తుంది.
పవిత్ర గ్రంథాలు
అమావాస్య రోజు రామాయణం, భగవద్గీత లేదా ఉపనిషత్తులు వంటి పవిత్ర గ్రంథాలను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం మెరుగుపడుతుంది. ఈ పవిత్రమైన చర్య దాత, గ్రహీత ఇద్దరికీ దైవిక ఆశీర్వాదాలు జ్ఞానాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు.
నెయ్యి
సోమవతి అమావాస్యనాడు నెయ్యి దానం చేయడం పవిత్రత, ప్రకాశానికి ప్రతీకగా ఉంటుంది. నెయ్యిని పవిత్రమైన ఆచారాలలో దేవతలకు నైవేద్యంగా ఉపయోగిస్తారు. ఇది అత్యంత విలువైన విరాళంగా మారుతుంది.
ఉప్పు
సోమవతి అమావాస్య రోజు ఉప్పును కూడా దానం చేయవచ్చు. ఇది మీకు మంచి చేస్తుంది. దాతకు ఆధ్యాత్మిక పుణ్యాన్ని ఇస్తుంది.
దుప్పట్లు
చల్లటి వాతావరణం సమయంలో దుప్పట్లు దానం చేయడం మంచిది. ఈ చర్య మీకు పూర్వీకుల ఆశీర్వాదాన్ని, దైవిక ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
డబ్బు
సోమవతి అమావాస్యనాడు డబ్బులు విరాళంగా ఇవ్వడం కూడా గొప్ప చర్యగా పరిగణిస్తారు. అవసరమైన వారి,కి పవిత్రమైన కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం మంచి పని. ఉదారమైన కార్యం యోగ్యతను ఇస్తుంది. కృతజ్ఞతా భావాన్ని, సంతృప్తిని పెంపొందిస్తుంది.
రావిచెట్టుకు ప్రదక్షిణలు
సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంది. అలాగే చెట్టుకు నీరు సమర్పించాలి. సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈరోజున అన్ని గ్రహాలు చంద్రుడితో కలిసి శివుడిని పూజిస్తాయని నమ్ముతారు. అందుకే ఈరోజు శివారాధన కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
ఈరోజు పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుందని చెప్తారు. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పితృదేవతల పేరిట దానం చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే మహిళలు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పచ్చి నూలు దారాన్ని చెట్టు చుట్టూ కట్టి పూజిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.