Nava panchama raja yogam: నవ పంచమ రాజ యోగం.. వీరి కోరికలు తీరే సమయం ఆసన్నమైంది
26 March 2024, 16:11 IST
- Nava panchama raja yogam: గ్రహాల రాకుమారుడు బుధుడు మేష రాశి ప్రవేశం చేశాడు. ఇప్పటికే ఆ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల నవ పంచమ యోగం ఏర్పడింది.
500 ఏళ్ల తర్వాత నవ పంచమ రాజయోగం
Nava panchama raja yogam: గ్రహాల రాకుమారుడు బుధుడు దేవ గురువు బృహస్పతి సంచరిస్తున్న మేష రాశి ప్రవేశం చేశాడు. దీంతో మేష రాశిలో బుధుడు, బృహస్పతి కలయిక జరిగింది. దీని వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడింది. సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ ఫోటోలు
అలాగే దాదాపు 12 సంవత్సరాల తర్వాత బుధుడు, గురు గ్రహాలు కలుసుకున్నాయి. నవ పంచమ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి నేటి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. బుధుడు ఏప్రిల్ 8 వరకు మేష రాశిలో ఉంటాడు. ఈ రాశిలో బుధుడు సంచరించినన్ని రోజులు ఈ యోగం ఉంటుంది.
సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహాలలో బుధుడు ఒకటి. ఈ గ్రహం అదృష్టాన్ని ఇస్తుంది. జాతకంలో బుధుడి స్థానం బలంగా ఉంటే కమ్యూనికేషన్, నైపుణ్యాలు మెరుగుపడతాయి. మనసులోని నిరాశాభావం తొలగిపోతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. బంధాలు బలపడతాయి. సంతోషకరమైన జీవితం పొందుతారు. మీ మాటలకు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు.
అటు దేవ గురువు బృహస్పతి జ్ఞానాన్ని ఇస్తే బుధుడు మేధస్సు ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి అధికారం, గౌరవం, అపారమైన శక్తి లభిస్తాయి. బుధ, గురు గ్రహాలు ఏ రాశుల వారిని అదృష్టవంతులని చేస్తుందో చూద్దాం.
ధనుస్సు రాశి
నవ పంచమ రాజయోగం వల్ల ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ధనుస్సు రాశి వారి ఆగిపోయిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం అనువుగా ఉంటుంది. ఆనందం, సంపద పొందుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగం మారాలని ఆలోచన ఉంటే ఈ సమయంలో మారడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. మీ జీవితం ప్రేమతో నిండిపోతుంది.
సింహ రాశి
బుధ, గురు గ్రహాల కలయిక సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలకు వస్తాయి. వ్యాపారాలకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని మీ భాగస్వామి మద్దతుతో పరిష్కరించుకుంటారు. నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ సొంతమవుతుంది. మీ మాటలతో ఎదుటివారిని ఆకర్షించగలుగుతారు. తద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ కుటుంబం మీకు మద్దతుగా నిలుస్తుంది. కోర్టు కేసులో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు.
కర్కాటక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ పంచమ రాజయోగం చాలా మంచిదిగా పరిగణిస్తారు. అటువంటి రాజయోగం కర్కాటకరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులు, ఉన్నతాధికారులు మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.