తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Combust: బుధుడి అస్తంగత్వం.. ఈ రాశుల వారికి కెరీర్ లో అనేక ఇబ్బందులు, ఉద్యోగంలో సవాళ్లు

Mercury combust: బుధుడి అస్తంగత్వం.. ఈ రాశుల వారికి కెరీర్ లో అనేక ఇబ్బందులు, ఉద్యోగంలో సవాళ్లు

Gunti Soundarya HT Telugu

26 March 2024, 11:52 IST

google News
    • Mercury combust: బుధుడు మరికొన్ని రోజుల్లో అస్తంగత్వ దశలోకి వెళ్లబోతున్నాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్ ప్రమాదంలో పడబోతుంది. అనేక సవాళ్ళు ఎదురుకాబోతున్నాయి. 
మేష రాశిలో బుధుడి అస్తంగత్వం
మేష రాశిలో బుధుడి అస్తంగత్వం

మేష రాశిలో బుధుడి అస్తంగత్వం

Mercury combust: గ్రహాల రాకుమారుడు బుధుడు మార్చి 26న మీన రాశిని వదిలి మేష రాశి ప్రవేశం చేశాడు. ఏప్రిల్ 4న ఇదే రాశిలో అస్తంగత్వ దశలోకి వెళతాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. బుధుడి అస్తంగత్వం వల్ల కొన్ని రాశుల వాళ్ళు వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ సంబంధాలు చెడిపోతాయి.

బుధుడి సంచార ప్రభావం వల్ల ఒక వ్యక్తి మాట్లాడే సామర్థ్యం ప్రతికూలంగా ఉంటుంది. దూకుడుగా ప్రవర్తిస్తారు. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించకుండా ఉద్రేకపూరితంగా మాటలు జారతారు. దీని వల్ల ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో కొన్ని రాశుల జాతకులు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ఓపికగా పనిచేయాలి. కెరీర్ పరంగా నష్టపోతారు. బుధుడి అస్తంగత్వ దశ వల్ల ఏయే రాశులు ఇబ్బందులు పడతాయో చూద్దాం.

మకర రాశి

మేష రాశిలో బుధుడి అస్తంగత్వ దశ వల్ల మకర రాశి జాతకులు కెరీర్ రంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల ఉద్యోగాల్లో మారాలని ఆలోచన కలుగుతుంది. కెరీర్ లో ఎత్తు పల్లాలు ఎదురవుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఉద్యోగం చేసే చోట అడుగడుగున సమస్యలు ఎదురవుతాయి. మేష రాశిలో బుధుడి అస్తంగత్వం కారణంగా పనిలో ఒత్తిడి ఎక్కువవుతుంది. వృత్తి జీవితంలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఎక్కువ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సహ ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి

బుధుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వారి కెరీర్ పతనమయ్యే సూచనలు ఉన్నాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు క్షీణిస్తాయి. ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉంటారు. కొత్త ఉద్యోగం చేయాలనే ఆలోచనలు కలుగుతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సవాళ్లు ఎదుర్కోవడం కోసం మీ సామర్థ్యం మెరుగుపరుచుకోవాలి.

కన్యా రాశి

ఉద్యోగం చేసే చోట పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఇది వారి కెరీర్ దెబ్బతీస్తుంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాగ్రతతో పని చేయాలి. సహనంతో కెరీర్ లోని సవాళ్లను అధిగమించాలి. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడంలో వెనుకబడిపోతారు. ఇది వృత్తి పురోగతి, ప్రమోషన్ మీద ప్రభావం చూపిస్తుంది. మనసు నిరాశతో నిండిపోతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి కెరీర్ కి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. కార్యాలయంలో సహ ఉద్యోగులు, ఉన్నతాధికారుల మద్దతు కోల్పోతారు. పనిమీద శ్రద్ధ సన్నగిల్లుతుంది. ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి జీవితం మలుపు తిరుగుతుంది.

మిథున రాశి

మిథున రాశి వారికి కెరీర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలో విజయం సాధించలేకపోతారు. ఉద్యోగ రంగంలో ఎక్కువ అసంతృప్తి ఉంటుంది. కష్టపడి పనిచేసిన తగిన ఫలితం ఉండకపోవచ్చు. ఇది మీ మనసును బాధిస్తుంది. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడతారు. వృత్తిపరమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కెరీర్లో విజయవంతమైన శిఖరాలు చేరుకోవడం కష్టంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి వృత్తిలో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కెరీర్లో ప్రగతిశీల ఫలితాలు రాకపోవచ్చు. శ్రద్ధగా పనిచేసినప్పటికీ సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం