Mercury transit: బుధుడి సంచారం.. ఈ రాశుల జాతకులు ప్రత్యేక బహుమతులు అందుకోబోతున్నారు-mercury transit in aries these zodiac signs get special gifts ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Mercury Transit In Aries These Zodiac Signs Get Special Gifts

Mercury transit: బుధుడి సంచారం.. ఈ రాశుల జాతకులు ప్రత్యేక బహుమతులు అందుకోబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Mar 25, 2024 02:30 PM IST

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మార్చి 26 మేష రాశి ప్రవేశం చేయబోతున్నాడు. బుధ గ్రహం రాశి మార్పు మొత్తం పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూసేయండి.

బుధుడు సంచారం
బుధుడు సంచారం

Mercury transit: కమ్యూనికేషన్, తెలివితేటలకు కారకుడిగా బుధుడిని భావిస్తారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడిని గ్రహాల రాకుమారుడుగా పిలుస్తారు. సౌమ్య స్వభావం కలిగిన బుధుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు సానుకూల ప్రభావాలను ఇస్తాడు. బుధుడి స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి తన మాటల ద్వారా ఎవరినైనా ఆకర్షించగలుగుతాడు. ఈ గ్రహం అనుకూలమైన స్థానంలో ఉంటే చాలా అదృష్టంగా పరిగణిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

మార్చి 26 బుధుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2న బుధుడు మేషరాశిలో తిరోగమన దశకు వెళతాడు. ఏప్రిల్9 వరకు ఇదే దశలో సంచరిస్తాడు. బుధుడి సంచారం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశిలో బుధుడి సంచారం చాలా ముఖ్యమైనది. గ్రహాల రాకుమారుడు సంచారం వల్ల మేష రాశి వారికి విజయం సాధించడానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో విజయానికి మార్గాలు చూపిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం బుధవారం నాడు గోమాతకు పచ్చి మేత తినిపించాలి.

వృషభ రాశి

శుక్రుడు వృషభ రాశికి అధిపతి. శుక్రుడు, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు. ఫలితంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపాలనుకుంటే ఈ సమయంలో అది సాధ్యమవుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి లేదంటే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఎవరితోను వివాదాలకు దిగకుండా ఉండటమే మంచిది. బుధుడి అనుగ్రహం కోసం బుధవారం ఉపవాసం ఉండాలి.

మిథున రాశి

బుధుడు మిథున రాశి వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభిస్తే ఊహించని విజయం, లాభాలు లభిస్తాయి. ఉన్నతాధికారులతో సానుకూల సంబంధాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని సంతోషపెడతారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తారు. మరిన్ని ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ స్తోత్రము పఠించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధుడి సంచారం వల్ల సామర్థ్యం మెరుగుపడుతుంది. పనిలో ముందుకు సాగుతారు. స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. పనిలో గుర్తింపు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ పొంది మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఉంటుంది. బుధవారం గణపతిని పూజించాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి బుధుడి సంచారం డబ్బు, ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినోదం కోసం మీ కుటుంబంతో పిక్నిక్ కి వెళ్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. బుధవారం పచ్చని మొక్కలు పెంచి వాటికి నీరు పోయడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది.

కన్యా రాశి

బుధుడి సంచారం సమయంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెడతాయి. కార్యాలయంలో పని ఒత్తిడి వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు.

తులా రాశి

తులా రాశి జాతకులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాములతో సంబంధం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశాలు లభిస్తాయి. అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. అవివాహిత వ్యక్తులకు వివాహం కుదురుతుంది. బుధవారం రోజు క్రమం తప్పకుండా ఓం బం బుధాయ నమః మంత్రాన్ని జపించాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉండదు. వృత్తిపరమైన, శారీరక పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయాన్ని కోల్పోతారు. ఉద్యోగంలో మీకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. బుధవారం నాడు గణేశుడుకి దుర్వా గడ్డిని సమర్పించండి.

ధనుస్సు రాశి

బుధుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో పోటీని తట్టుకొని నిలబడగలుగుతారు. గౌరవాన్ని అందుకుంటారు. పనికి గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి

మకర రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. తోబుట్టువులతో గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. రుణాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనిలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది . కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఫలితంగా మనసు సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి

చదువులో పురోగతి ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి లేదంటే డబ్బు నష్టపోతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బుధుడి అనుగ్రహం కోసం బుధవారం నాడు మీ సోదరికి ఆకుపచ్చ రంగు గాజులు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ఇవ్వండి.

మీన రాశి

బుధుడి సంచారం వల్ల మీన రాశి వారి కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. అయితే కొన్నిసార్లు మీ మాటల ప్రభావం వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంది. మాట తీరు నియంత్రించుకోవాలి లేదంటే పనిలో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారం చేసే వారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అవసరమైన సమయంలో అండగా ఉంటారు. డబ్బులు ఆదా చేయగలుగుతారు. పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు.