తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Meena Rasi Today: మీన రాశి వారికి ఈరోజు ఆకస్మిక ఖర్చు, కానీ టైమ్‌కి చేతుల్లోకి డబ్బు

Meena Rasi Today: మీన రాశి వారికి ఈరోజు ఆకస్మిక ఖర్చు, కానీ టైమ్‌కి చేతుల్లోకి డబ్బు

Galeti Rajendra HT Telugu

24 August 2024, 8:18 IST

google News
  • Pisces Horoscope Today 24th August 2024: రాశిచక్రంలో 12వ రాశి మీన రాశి. పుట్టిన సమయంలో మీన రాశిలో సంచరించే జాతకుల రాశిని మీన రాశిగా పరిగణిస్తారు. ఈరోజు మీన రాశి వారి కెరీర్, ఆర్థిక, ఆరోగ్య, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 

మీన రాశి
మీన రాశి

మీన రాశి

Pisces Horoscope Today: ఈ రోజు మీన రాశి వారికి డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు దొరుకుతాయి. ఏ ఆర్థిక నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజూ యోగా, వ్యాయామం చేయాలి.

లేటెస్ట్ ఫోటోలు

Somavathi Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య, ఆ రోజు వీటిని దానం చేస్తే సంపద కలుగుతుంది

Dec 23, 2024, 09:24 AM

2025లో కుజుడి వల్ల ఈ రాశులవారికి పట్టిన దరిద్రం అంతా పోయే అవకాశం!

Dec 22, 2024, 10:18 PM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఆర్థిక కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్​

Dec 22, 2024, 12:06 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ప్రేమ

ఈ రోజు మీన రాశి వారి ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు భాగస్వామితో సంభాషణ ద్వారా భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ రోజు ఉత్తమ సమయం. కొంతమంది ఒంటరి మీన రాశి జాతకులు కొత్త వ్యక్తిని కలుసుకోవచ్చు.

రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు ఈరోజు ఎమోషనల్‌గా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీ భావాలను మీ భాగస్వామితో నిజాయితీగా పంచుకోండి. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఈరోజు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

కెరీర్

ఆఫీసులో సహోద్యోగుల సహకారంతో చేసే పనులు ఈరోజు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆగిపోయిన పనులు కూడా విజయవంతమవుతాయి. కాబట్టి టీమ్ వర్క్‌లో పనిచేయడానికి వచ్చిన కొత్త అవకాశాలను ఈరోజు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. కొత్త మార్పులుకి లేదా అనుకోని సంఘటనలకు మానసికంగా సిద్ధంగా ఉండండి. 

కొత్త సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు వృత్తి జీవితంలో పురోగతి కోసం అనేక సువర్ణావకాశాలను పొందుతారు. మీ పరిశీలనా స్వభావం కెరీర్ సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది.  మీ వినూత్న ఆలోచనతో బాస్‌ మిమ్మల్ని ప్రశంసిస్తారు.  

ఆర్థిక

కొంతమంది మీన రాశి జాతకులు ఈరోజు ప్రారంభంలో ఆభరణాలు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు నూతన ప్రాంతాల నుంచి నిధులు సేకరించడంలో విజయం సాధిస్తారు. అయితే విదేశాల నుంచి వచ్చే చెల్లింపులకు సంబంధించి చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు, మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, రిస్క్‌తో నిండిన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. రుణం తిరిగి చెల్లించడానికి ఈ రోజు ఉత్తమమైన రోజు.  

ఆరోగ్యం

మీన రాశి వారు ఈరోజు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం చేయండి. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే, ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. మీరు ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో చేరవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి. ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.

తదుపరి వ్యాసం