తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్గశిర లక్ష్మీ వ్రతము.. ఈ మాసంలో ప్రతి గురువారం చేయాల్సిన పూజ

మార్గశిర లక్ష్మీ వ్రతము.. ఈ మాసంలో ప్రతి గురువారం చేయాల్సిన పూజ

HT Telugu Desk HT Telugu

19 December 2023, 11:48 IST

    • మార్గశిర లక్ష్మీ వ్రతముః మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టఐశ్వర్యాలతో తులతూగుతారని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
మార్గశిర లక్ష్మీ వ్రతముః మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టఐశ్వర్యాలతో తులతూగుతారు
మార్గశిర లక్ష్మీ వ్రతముః మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టఐశ్వర్యాలతో తులతూగుతారు (Pixabay)

మార్గశిర లక్ష్మీ వ్రతముః మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టఐశ్వర్యాలతో తులతూగుతారు

మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టఐశ్వర్యాలతో తులతూగుతారని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. మార్గశిర లక్ష్మీ వ్రతం గురించి వివరించారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారూ ఇళ్ళను ఆవు పేడతో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుకొని స్నానం చేసి కొత్తబట్టలు ధరించారు.

లక్షీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో “మహర్షీ! ప్రజలంతా కలసి ఇంత అనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి” అన్నాడు. “గురువారం చేసే ఈ పూజను లక్షీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది” అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు.

నారదుడు “'మహనీయా! ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారు. వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి” అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు.

ఒకనాడు ఒక లక్షివారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో “స్వామీ! ఈరోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసేరోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసినవారిని అనుగ్రహిస్తాను” అని పలికింది.

విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకార భూషితయై మహాలక్ష్మీ దేవి భూలోకానికి పయనమైంది. ఒక ముసలి బ్రాహ్మణ మూర్తి రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి “అవ్వా! ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం లక్ష్మీపూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి?” అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ “అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను” అనగా మహాలక్షి మందహాసంతో ఇలా పలికింది.

“మార్గశిర గురువారం ఉదయమే నిద్ర లేచి, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దానిని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా అలంకరించాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దానిమీద కొలతపాత్రను ఉంచి, పసుపు నీటితో కడిగిన పోకచెక్క వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ కొలమానంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి.

ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండివంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒ క విధానం” అని అమ్మవారు చెప్పింది.

“రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్టతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మనసు నిర్మలంగా ఉంచుకొని పదిమందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్షీ దేవి నిలుస్తుంది..’’ అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది.

“ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వా! గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవక పోయినా, ఆ ఇంట లక్షి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు, వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్కక్షణం కూడా లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. అంతేకాదు.. అ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది.

అదే విధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తమామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనమునకు ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగనివారి ఇంట లక్షీదేవి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రి అకారణంగా, అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరిచేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు.

గురువారం, అమావాస్య, సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి (నరకానికి)కి పోతుంది. ఈ మూడు తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా ఉంటుందో, లేదా నక్తం ఉంటుందో, లక్షి దేవతని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని (ముఖం పెట్టి) భోజనం చేయకూడదు.

అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటీ పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడపడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రము. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రి ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు, బ్రాహ్మణులయందు భక్తివిశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్షీ దేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది.” అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయల్దేరింది.

ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఓ పేద స్త్రీ ప్రతిరోజూ ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది. ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. 'ఓ భక్తురాలా! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో. ప్రసాదిస్తాను’ అని పలికింది. సాక్షాత్‌ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీకి నోటిమాట రాక ఏ కోరికా కోరలేదు.

అప్పుడు లక్ష్మీదేవి “నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు’ అని వరాలిచ్చింది. 'నా వ్రతం విడువకుండా చేయి. విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది’ అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిదేవిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది.. అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రులవారితో ఈ కథ చెప్పాడు. శ్రీ మహాలక్షి అమ్మ వారితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచారగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం