Maha ShivRatri 2023 : సద్గురుతో మహా శివరాత్రి.. టికెట్ ధర ఎంత? బుకింగ్ ఎలా చేయాలి?
10 February 2023, 11:47 IST
- Maha ShivRatri 2023 : ఈశా యోగా సెంటర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి. టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? ధరలు ఎలా ఉన్నాయి?
ప్రతీకాత్మక చిత్రం
మహా శివరాత్రి(Maha Shiva Ratri) కోసం ఈశా యోగా సెంటర్(isha yoga center) ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సద్గురుతో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనచ్చు. దేశంలో జరుపుకొనే పండుగలలో మహా శివరాత్రి ముఖ్యమైనది. శివనామస్మరణతో మారుమోగిపోనుంది. శివుడిని చాలామంది భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. జాగరణ చేస్తారు. రాత్రంతా శివుడి పేరు తలుస్తారు. మహాశివరాత్రి శుభ ముహూర్తంలో శివుడిని పూజించాలని, ప్రార్థనలు చేయాలని నమ్ముతారు.
సద్గురు(Sadhguru) ఈశా యోగా కేంద్రం చాలా సంవత్సరాలుగా మహాశివరాత్రిని జరుపుతుంది. ఆ రోజున సద్గురు శివునికి ప్రార్థనలు, పూజలు చేయడమే కాకుండా నృత్యం, సంగీతం, ధ్యానం కూడా చేస్తారు. ఈ వేడుకను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈశా కేంద్రాన్ని సందర్శిస్తారు.
అయితే, ఈ వేడుకలకు హాజరు కావాలంటే, మీరు ముందుగా బుకింగ్ చేసుకోవాలి. వివిధ ధరల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకోవచ్చు. మీ సెలక్షన్ బట్టి, మీకు సీటు కేటాయిస్తారు. మీరు ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలను చూడవచ్చు.
సద్గురుతో మహాశివరాత్రి 2023 వేడుక కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో జరుగుతాయి. మీరు isha.sadhguru.org/mahashivratri లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. గంగా టిక్కెట్ ధర రూ.50000, యమునా రూ. 25000, మహానది రూ. 10000, నర్మద రూ. 5000, బ్రహ్మపుత్ర రూ. 2500, గోదావరి రూ. 1000, కావేరి రూ. 500, తాపీ రూ. 250, తామిరపరాణి సీట్లలో ఉచితంగా చూడొచ్చు. మీరు ఎంచుకున్న టిక్కెట్‌లను బట్టి, మీకు మీ సీట్లు కేటాయిస్తారు.
ఒకవేళ టికెట్ తీసుకోకపోతే.. ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో isha.sadhguru.org/mahashivratri/live-webstreamలో కూడా చూడవచ్చు. ఈశా ఫౌండేషన్, సద్గురు యూట్యూబ్ ఛానళ్లలో ఈశా మహా శివరాత్రి లైవ్ స్ట్రీమింగ్(Live Streaming) అవుతుంది.
ఇండియాలో మహా శివరాత్రి(Maha Shivratri) ప్రధాన పండుగల్లో ఒకటి. ఆది గురువుగా పేరున్న శివుడికి ధ్యానం అంటే మహా ఇష్టం. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయడం కారణంగా మనలో కొత్త శక్తి వస్తుందని భక్తుల నమ్మకం. శారీరకంగా, మానసికంగా ఎప్పుడూ జాగృతిగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటారు. ఆరోజు రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానంలో ఉండమని చెబుతుంటారు.