Samsung Galaxy S23 series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍లపై ప్రీ-బుకింగ్ ఆఫర్లు.. ధరలు, కలర్ ఆప్షన్ల వివరాలు-samsung galaxy s23 series price in india pre booking offers colour options details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍లపై ప్రీ-బుకింగ్ ఆఫర్లు.. ధరలు, కలర్ ఆప్షన్ల వివరాలు

Samsung Galaxy S23 series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍లపై ప్రీ-బుకింగ్ ఆఫర్లు.. ధరలు, కలర్ ఆప్షన్ల వివరాలు

Feb 05, 2023, 07:01 PM IST Chatakonda Krishna Prakash
Feb 05, 2023, 05:57 PM , IST

  • Samsung Galaxy S23 series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్.. ఈనెల 1వ తేదీన ఇండియాలో లాంచ్ అయింది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ (Samsung Galaxy S23+), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫ్లాగ్‍షిప్ ఫోన్లు ఈ సిరీస్‍లో వచ్చాయి. ప్రస్తుతం ఈ మొబైళ్ల ప్రీ-బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ మూడు ప్రీమియమ్ ఫోన్‍ల ధరలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లు, కలర్ ఆప్షన్లు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy S23 Ultra: సామ్‍సంగ్ గెలాక్సీ అల్ట్రా 12జీబీ ర్యామ్‍తో మూడు స్టోరేజ్ వేరియంట్లను కలిగి ఉంది. 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.1,24,999, రూ.1,34,999, రూ.1,54,999గా ఉన్నాయి. 

(1 / 9)

సామ్‍సంగ్ వెబ్‍సైట్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ అల్ట్రా ఫోన్‍ను ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేస్తే గెలాక్సీ వాచ్4 ఎల్‍టీఈ స్మార్ట్ వాచ్, గెలాక్సీ బడ్స్2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.4,999కే సొంతం చేసుకోవచ్చు. హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు, ఎస్‍బీఐ క్రెడిట్ కార్డుల్లో దేనితో అయినా బుక్ చేసుకుంటే రూ.8,000 వరకు అదనపు డిస్కౌంట్‍ను పొందవచ్చు. 

(2 / 9)

ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రీమియమ్ ఫోన్ లభిస్తోంది. 

(3 / 9)

Samsung Galaxy S23+: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 8జీబీ ర్యామ్‍తో 256జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.94,999, రూ.1,04,999గా ఉన్నాయి. 

(4 / 9)

ఫాంటమ్, బ్లాక్, క్రీమ్ కలర్లలో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ అందుబాటులోకి వచ్చింది.

(5 / 9)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ మొబైల్‍ను ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లు రూ.4,999 ప్రత్యేక ధరకే గెలాక్సీ వాచ్4 బీటీని దక్కించుకోవచ్చు. ఎస్‍బీఐ క్రెడిట్ కార్డును వినియోగిస్తే రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. 

(6 / 9)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 కూడా రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.74,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.79,999గా ఉంది.

(7 / 9)

ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ కలర్ ఆప్షన్‍లలో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 లభిస్తోంది. 

(8 / 9)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23ని ప్రీ-బుక్ చేసుకుంటే రూ.5,000 వరకు బెనిఫిట్స్, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు, ఎస్‍బీఐ క్రెడిట్ కార్డుల్లో దేనితో అయినా ప్రీ-బుక్ చేసుకుంటే రూ.8,000 వరకు క్యాష్ బ్యాక్‍ను దక్కించుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23  సిరీస్ ఫోన్‍ల ప్రీ-బుకింగ్ నడుస్తుండగా.. ఈ మొబైళ్లు ఈనెల 17వ తేదీన సామ్‍సంగ్ వెబ్‍సైట్, ఈ-కామర్స్ సైట్‍లలో ఓపెన్‍ సేల్‍కు వస్తాయి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు