Love horoscope 2024: కొత్త ఏడాది ఈ రాశుల వారి లవ్ లైఫ్ థ్రిల్లింగ్ గా ఉండబోతుంది
08 December 2023, 10:46 IST
- Love Horoscope: కొత్త సంవత్సరం మేషం నుంచి మీనం వరకు ఏయే రాశుల వారి లవ్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం.
ఈ రాశుల వారి లవ్ లైఫ్ అద్భుతం
ప్రేమ లేనిదే జీవితం లేదు. బంధాలు నిలబెడుతూ అందరినీ దగ్గర చేస్తుంది. కొత్త ఏడాది కొత్త వాళ్ళని కలవాలని, ప్రేమించ వ్యక్తులని పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. మీ రాశి ఫలం ఆధారంగా మీకు ఆ ఆదృష్టం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే 2024 కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ప్రేమ అద్భుతంగా ఉండబోతుంది. వీటిలో మీ రాశి ఉందేమో చూసుకోండి.
లేటెస్ట్ ఫోటోలు
మేషం
కొత్త ఏడాది మేష రాశి వాళ్ళు ప్రేమలో మునిగిపోబోతున్నారు. మీరు మీ జీవితంలో ఎవరినైనా ప్రత్యేకంగా కలుసుకుంటారు. వారితో జీవితం ముడిపడే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న జంటలకి మార్చిలో వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ శుక్రుని తిరోగమనం కారణంగా ఆగస్ట్ లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. రిలేషన్ షిప్ లో ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వేసవి కాలంలో మీరు రొమాంటిక్ లైఫ్ మరింత ఉత్సాహంగా మారబోతుంది. ఏడాది చివర్లో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఎదురుకావచ్చు.
వృషభం
ఈ రాశి వారి జీవితంలో రొమాంటిక్ లైఫ్ మరింత మెరుగుపడుతుంది. ఫిబ్రవరి, అక్టోబర్ లో ప్రేమ మరింత ప్రత్యేకం కానుంది. డిసెంబర్ లో రొమాంటిక్ లైఫ్ మరో అడుగు ముందుకు వేయబోతుంది. మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, నవంబర్ నెలలో సంబంధాలు మెరుగుపడతాయి. కానీ కొన్ని నెలలు మాత్రం దంపతుల మధ్య అనుకూలంగా లేవు. జనవరి, జూన్, జులై, ఆగస్టులో ఇరువురి మధ్య చిన్న గొడవలు, అసూయ భావాలు ఏర్పడే అవకాశం ఉంది. దంపతులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి తీసుకోవడం మంచిది.
మిథునం
మిథున రాశి వారికి కొత్త సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. మేలో వివాహం గురించి చర్చించుకుంటారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు. దాని వల్ల ఆగస్టులో రొమాంటిక్ లైఫ్ సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. నవంబర్ నెలలో శృంగార జీవితం సంతృప్తినిస్తుంది. కానీ ఇతర నెలల్లో మాత్రం కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయి.
కర్కాటకం
కొత్త సంవత్సరం ప్రారంభంలో సంబంధాలు ఉద్వేగభరితంగా ఉండకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ఇతరులతో మీ సంబంధాలు ప్రభావితం కానున్నాయి. ఫిబ్రవరి, మార్చి, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కొన్ని రోజులు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆగస్టులో ఇరువురు సర్దుకుని ఉంటూ జీవితాన్ని ముందుకు సాగించాలి.
సింహ రాశి
సింహ రాశి వారికి 2024 ప్రేమకు అనుకూలమైన కాలం కానీ ఫిబ్రవరి 19వ తేదీ వరకు రొమాంటిక్ జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు. మార్చి వరకు రొమాంటిక్ రిలేషన్ షిప్స్ సంతృప్తికరంగా ఉంటుంది. ఏప్రిల్ లో లవ్ లైఫ్ సమస్యలో పడుతుంది. మళ్ళీ మేలో ప్రేమ వికాశిస్తుంది. ఆగస్టులో మీ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.
కన్య
ఈ రాశి వారికి ప్రేమ జీవితం కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మార్చి నుంచి మే వరకు సంతోషకరమైన జీవితం గడుపుతారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. జులైలో విడిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంధం నిలబడుతుంది. అక్టోబర్ లో వివాహానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. మిగతా నెలలు ప్రేమ, ఆనందంతో సంతోషకరమైన జీవితం గడుపుతారు.
తుల
కొత్త ప్రేమ పొందుతారు. మార్చిలో వివాహానికి సంబంధించి శుభవార్త వింటారు. అక్టోబర్ లో చిన్న ఎదురుదెబ్బ తగులుతుంది. డిసెంబర్ లో వచ్చే సమస్యలు పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టాలి.
వృశ్చికం
మీ ప్రేమ జీవితాన్ని ఇబ్బంది పెట్టె సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జులైలో విడిపోవాలనే ఆలోచన రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడం మంచిది. సెప్టెంబర్ నెల ఆనందంగా ఉంటారు. ఇక అప్పటి నుంచి సంవత్సరం చివరి వరకు అద్భుతంగా ఉంటుంది. పెళ్లి గురించి నిర్ణయాలు తీసుకుంటారు. శృంగార జీవితం మెరుగుపడుతుంది.
ధనస్సు
2024లో మీ ప్రేమ జీవితం బాగా మొదలైనప్పటికీ ఫిబ్రవరిలో అది దెబ్బతింటుంది. మార్చిలో కొత్త వారితో డేటింగ్ లేదా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చికాకులు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళితే ఆనందకరమైన జీవితం పొందుతారు. ఏడాది చివరి నాటికి ప్రేమ జీవితంలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి.
మకరం
ఈ రాశి వారికి ఇదొక అద్భుతమైన సంవత్సరంగా మారబోతుంది. మార్చి వరకు ప్రేమలో మునిగిపోతారు. జూన్, జులై నెలలో ఉద్వేగభరిత క్షణాలు అనుభవిస్తారు. సెప్టెంబర్, నవంబర్ బాగున్నాయి. కానీ అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలం కాస్త జాగ్రత్తగా ఉంటే ప్రేమ జీవితం బాగుంటుంది.
కుంభం
అన్ని రకాల అనుభవాలు ఎదురవుతాయి. జూన్ వరకు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మరలా మూడు నెలల పాటు లవ్ లైఫ్ కాస్త గాడితప్పుతుంది. సంవత్సరం చివరికి మాత్రం అద్భుతంగా మారుతుంది. అక్టోబర్ లో వివాహం జరిగే అవకాశం ఉంటుంది.
మీనం
ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే మరుపురాని జ్ఞాపకంగా మారుతుంది. మే లో వివాహం జరుగుతుంది. సెప్టెంబర్ లో రొమాంటిక్ లైఫ్ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. నవంబర్, డిసెంబర్ లో మీ జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తికి మరింత చేరువ కానున్నారు.