Kanya Rashi 2025: కన్య రాశి జాతకులకు ఈ సంవత్సరం అన్నీ శుభ ఫలితాలే
11 December 2024, 9:34 IST
- Kanya Rashi 2025 telugu: కన్య రాశి జాతకులకు 2025 సంవత్సరంలో రాశి ఫలాలు శుభ ఫలితాలను ఇవ్వనున్నట్టు పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు కన్య రాశి వార్షిక రాశి ఫలాలను అందించారు.
కన్య రాశి జాతకులకు 2025 సంవత్సరంలో రాశి ఫలాలు
2025 సంవత్సర కన్య రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ చూడొచ్చు. బృహస్పతి మే నుండి పదో స్థానము నందు సంచరించనున్నాడు. శని 7వ స్థానమునందు సంచరించనున్నాడు. రాహువు మే నుండి ఆరో స్థానము నందు, కేతువు మే నుండి పన్నెండవ స్థానమునందు సంచరించనున్నారు. ఆయా గ్రహాల సంచారం కారణంగా కన్యా రాశి వారికి 2025 సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితములు తెచ్చే సంవత్సరంగా చూడవచ్చును.
లేటెస్ట్ ఫోటోలు
ఎవరెవరికి ఏయే ఫలితాలు?
కన్యా రాశివారికి 2025 సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తి. ఆదాయము పెరుగును. శుభకార్యములు జరుగును. గృహలాభము కలుగును. ఆధ్యాత్మిక చింతన పెరుగును. దైవదర్శనాలు వంటివి కలుగును. అప్పుల బాధలు తొలగును. అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. విదేశీ ప్రయాణాలు లాభించును
విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరం. శుభ ఫలితాలను పొందెదరు. రాజకీయ నాయకులకు కలసివచ్చును. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపారాభివృద్ధి కలుగును. వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితములు కనపడును. విదేశీ ప్రయాణములు వంటివి లాభించును.
రైతాంగానికి మధ్యస్థ ఫలితము కలుగును. సినీ, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలసివచ్చును. వ్యయస్థానములో రాహువు ప్రభావం చేత ఖర్చులను నియంత్రిం చుకోవాలని సూచన.
కన్యారాశి వారు శత్రువులపై విజయాన్ని పొందెదరు. కొంత కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడెదరు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చి శుభఫలితాలను అందించే సంవత్సరం. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము కలుగును. ఉద్యోగస్తులకు శుభఫలితములు కలుగును.
చేయవలసిన పరిహారాలు
కన్యా రాశి జాతకులు 2025లో మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. అలాగే కనకధారా స్తోత్రాన్ని పఠించండి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనాల వలన శుభ ఫలితాలు కలుగును.
జనవరి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబములో కోపతాపములు పెరుగును. పెద్దవారితో అనుకూలం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత. స్థిరాస్తి వృద్ధి.
ఫిబ్రవరి 2025:
ఈ మాసం కన్య రాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములు అనుకూలించును. గృహోపకరణ వస్తువులు కొంటారు. స్థిరాస్తి, వాహనాలు కొంటారు. ఉద్యోగావకాశములు. ఆప్తులను కలుసుకుంటారు. ఆచితూచి సంభాషించాలి. స్నేహితుల సహకారముంటుంది.
మార్చి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార, ఉద్యోగపరంగా కలసి వచ్చును. పిల్లలతో ప్రయాణములు, విలాసాలు, ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ పరంగా కలసివచ్చును. ఇతర పనులు వల్ల స్వల్ప ఇబ్బందులుంటాయి.
ఏప్రిల్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి యగును. చెడు స్నేహములు చేయుట. ధన నష్టములు. స్త్రీ పరిచయములు. సమయానికి భోజనం లేకపోవుట. ఇంటియందు సౌఖ్యము. ప్రతీ పనియందు వ్యతిరేకంగా ఉంటుంది.
మే 2025:
ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్యా పిల్లలతో కలసి తీర్థయాత్రలు చేయుదురు. మంచి అవకాశములు లభించును. ముఖ్యం సమాచారం అందుకుంటారు. వృత్తిపరములు మార్పులేర్పడును. కార్యసిద్ధి.
జూన్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. వ్యర్థ ప్రయాణములు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు సూచితం. దైవ కార్యములలో పాల్గొనెదరు. అపవాదులు వచ్చును. గృహనిర్మాణాలు, శుభకార్యాలు ఉంటాయి.
జూలై 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విందులలో పాల్గొనెదరు. మాటపట్టింపులు ఉంటాయి. అశుభమైన వార్తలు వింటారు. ధనలాభముంది. శుభకార్యాలలో పాల్గొంటారు. గౌరవం పెరుగును. విరోధములుంటాయి. ప్రారంభములో ఆటంకాలుంటాయి.
ఆగస్టు 2025:
ఈ మాసం కన్య రాశి జాతకులకు అనుకూలంగా లేదు. కార్యహాని. కోర్టు వ్యవహారములు అనుకూలించవు. అధిక ఒత్తిడి. వ్యాపార, ఉద్యోగపరంగా అనుకూలం. ధనలాభముంది. ఆర్థిక లావాదేవీలు కలసివచ్చును. ఇతరులు మిమ్ములను మోసం చేయుదురు.
సెప్టెంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవసాయ మూలకంగా ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో కలసి ప్రయాణించెదరు. మానసిక అశాంతి.
అక్టోబర్ 2025:
ఈ మాసంలో కన్య రాశి వారికి అనుకూలంగా లేదు. ఇతరులతో వివాదాలేర్పడును. ప్రేమ విషయాలు అనుకూలించును. శుభకార్యములు చేయుదురు. దూరప్రయాణా లుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. కార్యాటంకాలు, విరోధములు, మనస్సున ఆందోళన.
నవంబర్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. స్త్రీపరంగా ధన వ్యయము. శత్రువు వలన భయము, అవమానములు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపారపరంగా లాభదాయకం. దూర ప్రయాణాలు చేయుదురు. ఆరోగ్యం అనుకూలించును. విలువైన వస్తువులు జాగ్రత్త.
డిసెంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చెడు వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. విందులు, వినోదాలకు ధనమును అధికముగా ఖర్చు చేయుదురు. స్త్రీ విరోధాలు వచ్చును. కొత్త పరిచయాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయాభివృద్ధి. బంధువులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త