తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi 2024: రేపే వినాయక చవితి- గణపతి ప్రతిష్ట సమయం, పూజా చేసేందుకు శుభ ముహూర్తం ఇదే

Vinayaka chavithi 2024: రేపే వినాయక చవితి- గణపతి ప్రతిష్ట సమయం, పూజా చేసేందుకు శుభ ముహూర్తం ఇదే

Gunti Soundarya HT Telugu

06 September 2024, 20:14 IST

google News
    • Vinayaka chavithi 2024: గణేశ చతుర్థి గణేశుడికి అంకితం చేయబడిన పండుగ 07 సెప్టెంబర్ 2024 జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు గణపతి బప్పను ఇంట్లో ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. గణేశుడిని పూజించే సులభమైన పద్ధతిని తెలుసుకోండి. 
వినాయక చవితి 2024
వినాయక చవితి 2024 (pinterest)

వినాయక చవితి 2024

Vinayaka chavithi 2024: గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను శ్రీ గణేశుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి 7 సెప్టెంబర్ 2024 న జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు గణేశోత్సవాలు జరుపుకుంటారు.

భక్తులు గణేష్ చతుర్థి రోజున ఎంతో వైభవంగా వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. మీరు కూడా గణేష్ చతుర్థి నాడు బప్పను ఇంటికి తీసుకురాబోతున్నట్లయితే ఆరాధన సులభమైన పద్ధతిని తెలుసుకోండి.

శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఉదయం 11.02 గంటల నుంచి మధ్యాహ్నం 1.33 వరకు మంచి సమయం ఉంది. నగరాన్ని బట్టి పూజ సమయంలో కొద్దిగా తేడా ఉండవచ్చు. హైదరాబాద్ లో పూజ చేసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.28 వరకు శుభ ముహూర్తం ఉంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వినాయకుడికి సంబంధించిన మంత్రాలు పఠిస్తూ పూజ ప్రారంభించుకోవచ్చు. షోడశ ఉపచారాలు ఆచారిస్తూ పూజ చేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి.

సులభమైన పద్ధతిలో ఇలా పూజ చేయండి

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసుకుని తోరణాలు కట్టుకోవాలి. గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు, పూజ గదిని పూర్తిగా శుభ్రం చేయండి. గంగాజలం చల్లిన తర్వాత గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించండి.

గణపతి బప్పా నుదుటిపై పసుపు చందనంతో తిలకం వేయండి. గణేశుడి విగ్రహం ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి. వినాయకుని విగ్రహం ముందు నీటితో నిండిన కలశాన్ని ఉంచండి. కొబ్బరి నీళ్లను కలశంలో నింపి బప్పాకు సమర్పించవచ్చు. 21 రకాల పత్రులను వినాయకుడికి సమర్పించాలి.

వినాయకుడికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలు సమర్పించడం మంచిది. అలాగే గణేశ విగ్రహానికి పసుపు పూలతో మాల వేయండి. భక్తులు గణేశుడికి ప్రీతికరమైన గరికను సమర్పించాలి. మీరు మీ భక్తి ప్రకారం దుర్వా 3, 5, 7, 9, 11 లేదా 21 అందించవచ్చు. గణపతి బప్పాకు తమలపాకులు అందించండి. అలాగే అందులో యాలకులు, లవంగాలు చేర్చండి.

వినాయక చవితి రోజు గణేశుడికి ఎంతో ఇష్టమైన మోదకం సమర్పించండి. శ్రీ గణేశుని అనుగ్రహం పొందడానికి పూజ సమయంలో మంత్రాలను జపించండి. మీరు గణేష్ స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. షోడశ ఉపచారాలతో పూజ చేసిన తర్వాత ఆరతి చేయండి.

గణేశ మంత్రం - ఓం గణ గణపతయే నమో నమః

శ్రీ సిద్ధివినాయక నమో నమః అనే మంత్రాలు పఠించండి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం