తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.. జాగ్రత్త

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.. జాగ్రత్త

10 December 2022, 4:00 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? డిసెంబర్ 10వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (10-12-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Gold price today : డిసెంబర్​ 17 : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Dec 17, 2024, 05:48 AM

TG Govt Medical College Recruitment 2024 : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 55 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..

Dec 17, 2024, 12:00 AM

Amritha Aiyer: అల్లరి నరేశ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న హనుమాన్ హీరోయిన్.. హాట్ ఫొటోలు

Dec 16, 2024, 09:49 PM

Jupiter Transit: కొత్త ఏడాది బృహస్పతి వల్ల ఈ 3 రాశుల వారికి విపరీతంగా కలిసొస్తుంది, జీవితంలో అంతా ఆనందమే

Dec 16, 2024, 07:59 PM

12 ఏళ తర్వాత ఈ రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. 2025లో వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ధన వర్షం!

Dec 16, 2024, 07:37 PM

Chandrababu And Pawan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ..నాగబాబుకు ఇచ్చే శాఖ సహా కీలక అంశాలపై చర్చ

Dec 16, 2024, 07:01 PM

మేషరాశి

మేష రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. కుటుంబ, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాలపట్ల ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మనస్తాపము, అనారోగ్యం కలిగే అవకాశముంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. కానీ చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్త ఫలితాలున్నాయి. ఒత్తిడి తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీ సౌఖ్యము కలుగుతుంది. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబము, ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఓర్పుతో ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈరోజు అంత అనుకూలముగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ధనలాభము కలుగుతుంది. శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేసే ప్రతీ పనిని అనుకూలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్యము అనుకూలించును. చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారములోని సమస్యలు తొలుగుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. కుటుంబమునందు సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

తదుపరి వ్యాసం