తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గురు ఛండాల యోగం సమాప్తం.. వీరికి ఇక శుభ ఫలితాలే

గురు ఛండాల యోగం సమాప్తం.. వీరికి ఇక శుభ ఫలితాలే

HT Telugu Desk HT Telugu

20 September 2023, 17:05 IST

google News
    • గురు ఛండాల యోగం సమాప్తం అవ్వడం చేత నవంబర్‌ నుంచి ఏయే రాశులవారికి శుభఫలితాలు కలుగుతాయి? చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.
గురు ఛండాల యోగం పరిసమాప్తం కావడంతో ప్రయోజనం పొందనున్న రాశులు
గురు ఛండాల యోగం పరిసమాప్తం కావడంతో ప్రయోజనం పొందనున్న రాశులు

గురు ఛండాల యోగం పరిసమాప్తం కావడంతో ప్రయోజనం పొందనున్న రాశులు

చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్‌ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేష రాశిలో గురునితో కలసి ఉన్నటువంటి రాహువు 30 అక్టోబర్‌ 2023న మీనరాశిలోనికి మారుచున్నాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గురు, రాహువులు మేషరాశిలో కలసి ఉండగా ఏర్పడిన గురు ఛండాల యోగం అక్టోబర్‌ నెలాఖరుకు పూర్తి అవుతుందని చిలకమర్తి తెలిపారు. 

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

ఈ గురు ఛండాల యోగం పరిసమాప్తి చెందటం వలన రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరించడం చేత గోచారపరంగా మేష మరియు తులా రాశుల వారికి శుభఫలితాలు కలుగుబోతున్నాయని చిలకమర్తి తెలిపారు.

గురు ఛండాల యోగ ప్రభావం పూర్తగుటచేత వృషభ, మిథున, కర్కాటక రాశుల వారికి వృశ్చిక, ధనస్సు, మకరరాశుల వారికి మధ్యస్థం నుండి శుభఫలితాలు కలగబోతున్నాయని చిలకమర్తి తెలిపారు. 

సింహ, కన్యా, కుంభ, మీన రాశుల వారికి రాహు కేతువుల యొక్క మార్చుల వలన ఒత్తిళ్ళు, సమస్యలతో కూడియున్నటువంటి గ్రహస్థితి కలుగుతుందని చిలకమర్తి తెలియచేశారు. 

మొత్తం మీద గురు ఛండాలయోగం పూర్తి అవ్వడం చేత ఒంటరిగా వున్న గురుడు పూర్తి స్థాయిలో శుభఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ పరిణామం పైన చెప్పిన విధంగా పలు రాశుల జాతకులకు శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం