Lucky Zodiac Signs: ఒకేసారి నాలుగు శుభ యోగాలు.. జనవరి 1వతేదీ నుంచీ ఈ రాశుల వారికి డబ్బు, పరపతి, శాంతి
15 December 2024, 13:00 IST
Lucky Zodiac Signs: కొత్త ఏడాది కొత్త ఆశలతో మొదలుపెట్టబోతున్న వారికి శుభవార్త. గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా ఏడాది ఆరంభంలోనే అంటే జనవరి 1వ తేదీన ఒకేసారి నాలుగు శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇది అన్ని రాశి చక్ర గుర్తుల వారికి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఐదు రాశుల వారిని అదృష్టం వరిస్తుంది.
ఒకేసారి నాలుగు శుభయోగాలు.. ఈ రాశుల వారి డబ్బు, పరపతి, శాంతి
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ఆశలు, కొత్త కొత్త ఆశయాలతో ఈ2025ను ప్రారంభించాలనుకునే వారికి ఇదొక శుభవార్త. గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా 2025ఆరంభంలోనే నాలుగు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం జనవరి 1వ తేదీ నాలుగు శుభయోగాలతో ప్రారంభం కానుంది. ఇది వ్యక్తుల జీవితంలోని రకరకాల అంశాల పట్ల అత్యంత శుభపరిణామాలను తీసుకురానుంది.
లేటెస్ట్ ఫోటోలు
హిందూ క్యాలెండర్ ప్రకారం 2025 జనవరి 1న హర్షణ, బాలవ, కౌలవ, టైటిల యోగాలు ఏర్పడనున్నాయి. కొత్త ఈ ఏడాది ఇలా శుభయోగాలతో ప్రారంభం కావడం చాలా శుభప్రదంగా, అరుదుగా చాలా అరుదుగా భావిస్తారు.
ఏ యోగం ఎలాంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. హర్ష యోగం ఏర్పడినప్పుడు మీరు భౌతిక సంతోషాన్ని, అదృష్టాన్ని, దృఢమైన శరీరాన్ని కలిగిస్తుంది. ఫలితంగా మీరు శత్రువులను నాశనం చేస్తారు. పాపపు చర్యలకు దూరంగా ఉంటారు.శక్తివంతమైన వ్యక్తితో స్నేహం చేస్తారు. ప్రియమైన వ్యక్తితో సమయం గడుపుతారు.
బాలవ యోగం( కరణం) అనేది జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అనేక కార్యకలాపాలకు మంచిదని చెబుతారు. ఇది యజ్ఞం, హోమం (అగ్ని ఆరాధన), వేదాల అధ్యయనం, ఇతిహాసాలు, పురాణాలను చదవడం, శాంతి కర్మలను ప్రేరేపిస్తుంది.
కౌలవ యోగం కరణం అనేది సాంఘికీకరణ, సంబంధాలను నిర్మించడం, జట్టుకృషికి పెంపొందించడం, ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయడుతుంది.
తైతీలా అనేది వేద జ్యోతిషశాస్త్రంలో కరణం. ఇది కమ్యూనికేషన్‌తో ముడిపడి ఉంది, వ్యక్తులను అదృష్టవంతులుగా మారుస్తుంది.
ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం..
మేషరాశి :
జనవరి ఆరంభంలోనే నాలుగు శుభయోగాలు ఏర్పడటం వల్ల మేష రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండేలా కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం వరం కంటే తక్కువేమీ కాదు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
మిథునం :
మిథున రాశి వారికి నూతన సంవత్సరం శుభదాయకంగా ఉంటుంది. మీరు ఎటువంటి ఆందోళన అయినా వదిలించుకోగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు పర్యటనకు వెళ్ళవలసి ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.
సింహం:
శుభ యోగాల ఫలితంగా సింహ రాశి వారికి నూతన సంవత్సరం అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ఆస్తి, వ్యాపారం మొదలైన వాటి ద్వారా అనుకోని లాభాలు పొందుతారు. ఇది విజయ సమయం, మీరు ఏది కోరుకున్నా, అది కచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉంది. భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతారు. రోజువారీ పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది, అధికారులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు అందుకుంటారు.
తులా రాశి:
తులా రాశివారు ఈ శుభయోగాల ఫలితంగా కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. అధికారులు మీ నుంచి సంతోషంగా ఉంటారు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు అందుకుంటారు.
కుంభ రాశి:
ఈ వారికి 2025 ఆరంభం నుంచీ శుభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త ప్రణాళికలు ఏర్పరుచుకుంటారు. అందుకు అనుగుణంగా కష్టపడతారు. ఈ సంవత్సరం మీకు ఒక వరంలా అనిపిస్తుంది. అన్ని వేళలా శుభాలనే అందిస్తుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార పరంగా ఇది చాలా మంచి సమయం. పాత మిత్రుడిని కలుసుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.