Gajakesari Yogam: 2025లో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఆర్థిక లాభం కూడా!-moon and jupiter conjunction in 2025 may give huge money and luck to these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gajakesari Yogam: 2025లో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఆర్థిక లాభం కూడా!

Gajakesari Yogam: 2025లో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఆర్థిక లాభం కూడా!

Ramya Sri Marka HT Telugu
Dec 13, 2024 03:19 PM IST

Gajakesari Yogam: గ్రహాల కదలికల్లో మార్పు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. 2025లో కీలక గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోనున్నాయి. చంద్రుడు, బృహస్పతి గ్రహాల మార్పు కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలకు తెచ్చిపెడుతుంది.

2025లో గజకేసరి యోగం.. ఈ రాశలు వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
2025లో గజకేసరి యోగం.. ఈ రాశలు వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు నీటి గ్రహం. ఇది మనసును, పరిసరాలు, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. వ్యక్తిజీవితంలో పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలకు చంద్రుడ కారకుడిగా చెబుతారు. అలాగే బృహస్పతి అంటే గురు గ్రహం జ్ఞానం, అభివృద్ధి, మేధస్సు, విశ్వాసం, ధైర్యం, శ్రేయస్సు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఉన్నత విద్య, చట్టం, దీర్ఘకాల ప్రయాణం, ఆత్మీయత వంటి వాటిని సూచిస్తుంది.ఈ రెండు శుభ గ్రహాల కలయిక అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. చంద్రుడు, గురువుల కలయితో వ్యక్తుల్లో దయాగుణం, ఉదారత, మిత్రుత్వ గుణం వంటివి పెరుగుతాయి. జ్ఞానం, మేధస్సు మెరుగవుతాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం 2025లో ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది. అది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టనుంది.

గజకేసరి యోగం ఎలా ఏర్పడనుంది?

జ్యోతిష్య గణన లెక్కల ప్రకారం..2025 మే నెలలో మిథున రాశిలో చంద్రుడు, గురు గ్రహాల కలయిక జరగనుంది. ఇది గజకేసరి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఈ యోగ ప్రభావం మొత్తం 12రాశుల్లో జన్మించిన వ్యక్తులపై పడుతుంది. అయితే ముఖ్యంగా ఐదు రాశుల వారి జీవితంలో అత్యంత శుభపరిమాణాలను తీసుకొస్తుంది. ఈ రాశులేవో తెలుసుకుందాం..

మిథున రాశి:

గజకేసరి యోగంతో మిథున రాశి వారికి ఉత్తమమైన సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వీరికి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మేథో సామర్థ్యం కారణంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరతాయి. అనుకోని విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పురోగతికి ఇది శుభ సమయం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ తో కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. యాదృచ్ఛిక ప్రయాణాలు ఉన్నాయి. పుణ్య కార్యాలు చేస్తారు.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి గజకేసరి యోగం లాభదాయకంగా ఉంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. వాహన యోగం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం మెరుగవుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. విద్యారంగంలోని వారి విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి వివాహ యోగం కూడా ఉంది.

తులా రాశి:

చంద్రుడు, గురు గ్రహాల కలయికతో ఏర్పడుతున్న గజకేసరి యోగం తులా రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇల్లు, స్థలం కొనాలనే కోరిక తీరుతుంది. వైవాహిక జీవితం ఆనందమయం అవుతుంది. ప్రయాణాలు చేస్తారు అవి మీకు బాగా కలిసివస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి.అనుకోని విధంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

ధనస్సు రాశి:

గజకేసరి యోగంతో ధనస్సు రాశి వారి జీవితం సంతోషంతో నిండిపోతుంది. కుటుంబ నుంచి సహాయం అందుతుంది. తండ్రి, అత్తామామల నుంచి ఆర్థిక సహకారం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంది. ఆర్థిక రంగంలో పురోగతి లభిస్తుంది. విద్యా రంగం వారికి విజయం లభిస్తుంది. వివాహ యోగం ఉంది.

కుంభ రాశి:

గజకేసరి యోగం కారణంగా కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఏలినాటి వని చివరి దశలో ఉన్నప్పడు వీరు వృత్తిలో పురోగతిని పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. విద్యారంగంలో విజయం సాధిస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంతానం లేని వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner