తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karkataka Sankranti: కర్కాటక సంక్రాంతి రోజు వీటిని దానం చేశారంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది

Karkataka sankranti: కర్కాటక సంక్రాంతి రోజు వీటిని దానం చేశారంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది

Gunti Soundarya HT Telugu

12 July 2024, 12:59 IST

google News
    • Karkataka sankranti: సూర్యుడు త్వరలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏయే వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. 
కర్కాటక సంక్రాంతి రోజు దానం చేయాల్సిన వస్తువులు ఇవే
కర్కాటక సంక్రాంతి రోజు దానం చేయాల్సిన వస్తువులు ఇవే

కర్కాటక సంక్రాంతి రోజు దానం చేయాల్సిన వస్తువులు ఇవే

 Karkataka sankranti: సూర్యుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేందుకు సూర్యుడికి ఒక నెల సమయం పడుతుంది. ఈ సమయాన్ని సంక్రాంతి అంటారు. ఈ నెలలో సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న సూర్యుడు జులై 16 నుంచి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీనినే కర్కాటక సంక్రాంతి అంటారు. 

కర్కాటక సంక్రాంతికి జ్యోతిష్యశాస్త్రంగా మాత్రమే కాకుండా మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా విభజిస్తారు. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయన కాలం మొదలవుతుంది. ఉత్తరాయణ కాలం ముగిసిపోతుంది. మరల సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది.

కర్కాటక సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు 

కర్కాటక సంక్రాంతి సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల సూర్య భగవానుడు సంతోషిస్తాడు. సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు సూర్య చాలీసాను క్రమం తప్పకుండా పఠించాలి. అలాగే ఉదయాన్నే నిద్ర లేచి సూర్య భగవానుడిని పూజిస్తూ అర్ఘ్యం సమర్పించాలి.  రాగి పాత్రలో నీళ్ళు తీసుకుని ఎరుపు రంగు పువ్వులు వేసి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది. సూర్య బీజ మంత్రాన్ని జపించాలి. ఈ సమయంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 

కర్కాటక సంక్రాంతి రోజు ఎరుపు రంగు దుస్తులు దానం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. అలాగే జాతకంలో కుజుడి స్థానం బలపడుతుంది. కర్కాటక సంక్రాంతి రోజు సూర్యభగవానుడి అనుగ్రహం పొందేందుకు గోధుమలు, బెల్లం, వేరుశనగ, చిలగడదుంప మొదలైన వాటిని దానం చేయడం మంచిది. వీటిని దానం చేయడం ద్వారా సూర్యుడి అనుకూల ప్రభావం మీమీద ఉంటుంది.  వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని పొందుతారు. డబ్బు సంపాదించేందుకు అవకాశాలు ఏర్పడతాయి. జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉంటే ఉద్యోగంలో ఉన్నత స్థానాలు, వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. కెరీర్ పురోభివృద్ధి ఉంటుంది.

కర్కాటక సంక్రాంతి రోజు పప్పు దినుసులు, మిరపకాయలు, తేనె మొదలైన వాటిని దానం చేయడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మంగళ దోషంతో బాధపడేవారు వీటిని దానం చేస్తే ఆ దోష ప్రభావం తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు. జాతకంలో మంగళ దోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే వైవాహిక జీవితంలోను సమస్యలు ఏర్పడతాయి. 

జాతకంలో సూర్యుడి స్థానాన్ని బలపరచుకునేందుకు కర్కాటక సంక్రాంతి రోజు హనుమాన్ చాలీసా, సూర్య చాలీసా వంటి పుస్తకాలను దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బలం, తెలివితేటలు పొందుతారు. సమస్యలను ఎదుర్కోగల సామర్థ్యం మెరుగుపడుతుంది. అదృష్టం లభిస్తుంది. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

తదుపరి వ్యాసం