తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Durga Devi: నవరాత్రుల్లో మీకు కలలో దుర్గాదేవి కనిపిస్తే అది శుభమా లేదా అశుభమా?

Goddess durga devi: నవరాత్రుల్లో మీకు కలలో దుర్గాదేవి కనిపిస్తే అది శుభమా లేదా అశుభమా?

Gunti Soundarya HT Telugu

03 October 2024, 10:46 IST

google News
    • Goddess durga devi: నేటి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 12 దసరా పండుగతో ముగుస్తాయి. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి కలలో కనిపిస్తుందా? వాటి అర్థం ఏంటో తెలుసా? అది మీకు శుభమా లేదంటే అశుభ సంకేతమా అనేది తెలుసుకోండి. 
కలలో దుర్గాదేవి కనిపిస్తే ఏంటి అర్థం
కలలో దుర్గాదేవి కనిపిస్తే ఏంటి అర్థం

కలలో దుర్గాదేవి కనిపిస్తే ఏంటి అర్థం

మనం నిద్రపోయేటప్పుడు అనేక కలలు వస్తూ ఉంటాయి. కొన్ని విచిత్రమైనవి ఉంటే మరికొన్ని సార్లు అమ్మవారు కనిపించడం, శివుడు కలలోకి రావడం జరుగుతుంది. నేటి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అటువంటి ఈ శుభ సమయంలో మీకు దుర్గాదేవి కలలో కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా?

నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మీకు నిద్రపోయేటప్పుడు కలలో అలంకరించిన దుర్గాదేవి కనిపిస్తే అది చాలా శుభప్రదంగా భావించవచ్చు. దీని అర్థం మీకు త్వరలో ఆనంద క్షణాలు రాబోతున్నాయి. సమస్యలు తొలగిపోనున్నాయి. రాబోయే కాలంలో కొన్ని శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో కష్టాలు తొలగిపోనున్నాయని అర్థం.

ఆలయం కనిపిస్తే

కలలో మీకు దుర్గాదేవి ఆలయం కనిపిస్తే అది కూడా శుభ సూచకంగా చెప్పవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండబోతుందని చెప్పేందుకు ఇదొక సంకేతంగా భావిస్తారు. త్వరలోనే మీ కోరికలు నెరవేరబోతున్నాయని చెప్పడం కోసం మీకు దుర్గాదేవి ఆలయం కనిపించడం.

అమ్మవారి విగ్రహం కనిపించిందా?

కలలో అమ్మవారి విగ్రహం ప్రశాంతంగా కనిపిస్తే అది మంచిదే. దీని వల్ల మీరు శారీరక, మానసిక సమస్యల నుంచి బయటపడబోతున్నారని అర్థం. ఇక వ్యాపారులకు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభించబోతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. జీవితంలోని అనేక కఠినమైన సమస్యల నుంచి బయట పడతారు.

అదే మీకు కలలో అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి బలపడబోతుందని సంకేతం. మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంపద రాబోతుందని అర్థం. అలాగే భవిష్యత్ లో ఆదాయానికి సంబంధించి మంచి వార్తలు కూడా వింటారు.

దుర్గాదేవికి ఇష్టమైన రంగు ఎరుపు. అందుకే పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు చునారి సమర్పిస్తారు. మీకు అమ్మవారు కలలో ఎరుపు రంగు దుస్తుల్లో కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంబజం అవుతున్నాయని సంకేతం. ప్రగతి పథంలో ముందుకు సాగిపోతారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి కాని వారికి ఈ కల చాలా మంచిది. త్వరలో మంచి జీవిత భాగస్వామి జీవితంలోకి రాబోతున్నారని అర్థం. దుఃఖం, బాధల నుంచి విముక్తి లభించబోతుందని సంకేతం. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విజయం సొంతం చేసుకుంటారు.

ఒకవేళ మీకు దుర్గాదేవి నలుపు రంగు దుస్తుల్లో ఉగ్ర రూపంలో కనిపిస్తే మాత్రం ఏదో చెడు జరగబోతుందని హెచ్చరిక. రాబోయే ప్రమాదాన్ని మీకు ముందుగానే హెచ్చరిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది వినాశనానికి, చెడుకు సంకేతంగా భావిస్తారు. అలాగే అమ్మవారు కోపంగా కనిపిస్తే మీరు చేస్తున్న పని అసంబద్ధంగా ఉందని అర్థం. వెంటనే మీరు ఏదైనా చెడు పని చేస్తున్నట్టయితే దాన్ని వెంటనే నిలిపివేయాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం