Dhanteras 2022: ఆరోజు ప్రధాన ద్వారం దగ్గర 13 దీపాలు వెలిగించాలట.. ఎందుకంటే..
10 November 2022, 14:30 IST
- Dhanteras 2022: దీపావళి 5 రోజులలో ధనత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆరోజు వెలిగించే దీపానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ దీప కాంతి ఏ దిశలో ప్రకాశించాలో మీకు తెలుసో.. ఏ వైపు దీపాన్ని ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధంతేరాస్ 2022
Dhanteras 2022 : హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు ధంతేరస్ పండుగను నిర్వహిస్తారు. ఆ రోజున లక్ష్మి, కుబేరులను పూజిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున వెలిగించే దీపానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో కృష్ణ పక్షం 3వ రోజున ధన్తేరస్ పండుగ చేసుకుంటాము. ఈ రోజు సముద్ర మథనం సమయంలో ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెప్తున్నాయి.
లేటెస్ట్ ఫోటోలు
ఈ సంవత్సరం ధన్తేరస్ శుభ సమయం, త్రయోదశి తిథి అక్టోబర్ 22న సాయంత్రం 4:24 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 23న సాయంత్రం 04:55 గంటలకు ముగుస్తుంది. ధన్తేరస్ రోజున లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తాము. మరణానికి అధిపతియైన యమరాజు ఆరాధనకు కూడా ఈ రోజున విశేష ప్రాముఖ్యత ఉంది.
మత విశ్వాసాల ప్రకారం.. ధన్తేరస్ రోజున యమరాజును ఆరాధిస్తే.. అకాల మరణ భయం శాశ్వతంగా ముగుస్తుంది. ధన్తేరస్ రోజున నిద్రించే ముందు ప్రధాన ద్వారం వద్ద 13 దీపాలను వెలిగించాలి. ఇంటి లోపల సమాన సంఖ్యలో దీపాలను వెలిగించాలని పురాణాలు చెప్తున్నాయి.
దీపం వెలిగించేటప్పుడు మీ ముఖాన్ని దక్షిణం వైపు ఉంచండి. యముడు దక్షిణ దిశలో ఉంటాడు. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని ధర్మకర్మ నిపుణులు చెప్తున్నారు.