తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi Mantralu: వినాయకుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి, అడ్డంకులన్నీ తొలగిపోతాయి

Vinayaka chavithi mantralu: వినాయకుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి, అడ్డంకులన్నీ తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu

07 September 2024, 6:00 IST

google News
    • Vinayaka chavithi mantralu: వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు గణపతికి సంబంధించిన ఈ శక్తివంతమైన మంత్రాలు పఠించండి. మీరు జీవితంలో ఎదుర్కొనే అన్నీ అడ్డంకుల నుంచి విముక్తి కలుగుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు. 
వినాయక చవితి రోజు పఠించాల్సిన మంత్రాలు ఇవే
వినాయక చవితి రోజు పఠించాల్సిన మంత్రాలు ఇవే (pixabay)

వినాయక చవితి రోజు పఠించాల్సిన మంత్రాలు ఇవే

Vinayaka chavithi mantralu: వినాయక చవితి పండుగను అందరూ అత్యంత వైభవంగా,ఉత్సాహంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 7 వినాయక చవితి వచ్చింది. ఈరోజు వినాయకుడి విగ్రహాని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. పూజ సమయంలో గణేషుడి మంత్రాలు పఠించడం చాలా శ్రేయస్కరం.

లేటెస్ట్ ఫోటోలు

January 17 horoscope: ఈ శుక్రవారం మీకు ఎలా ఉండబోతోంది? రేపటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి..

Jan 16, 2025, 09:26 PM

January 16 horoscope: రేపు మీ రాశి ఫలం ఎలా ఉండబోతోందో, పరిహారాలేంటో తెలుసుకోండి?

Jan 15, 2025, 10:36 PM

రెండు గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. ఆదాయం, ఆనందం పెరుగుతుంది!

Jan 14, 2025, 10:50 PM

January 15 horoscope: జనవరి 15 మీకు ఎలా ఉండబోతోంది? రేపటి రాశిఫలాలను ఈ రోజే తెలుసుకోండి!

Jan 14, 2025, 09:05 PM

ఈ రాశుల వారికి కష్టకాలం- చేతిలో డబ్బు ఉండదు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి..

Jan 14, 2025, 05:48 AM

ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ షురూ.. ధనం, సంతోషం, సక్సెస్!

Jan 12, 2025, 07:20 PM

పూర్ణ హృదయంతో వినాయకుడికి సంబంధించి కొన్ని మంత్రాలు పఠించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరతాయి. గణపతి ఆశీర్వాదాలు పొందేందుకు పూజ వేళ పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు, వాటి అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఈ మంత్రాలు పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవిస్తారు. ఎటువంటి మంత్రాలు జపించాలో ఇక్కడ తెలుసుకోండి.

1.ఓం గన్ గణపతయే నమః

గణపతికి నమస్కరిస్తూ, అతని గొప్ప గుణాలు అన్నింటినీ కొనియాడుతూ ఈ మంత్రం జపిస్తారు. జ్ఞానం, తెలివికి అధిపతి అయిన గణేషుడికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. గణపతిలోని లక్షణాలు మన జీవితంలో కూడా అనుసరించాలని కోరుకుంటూ ఈ మంత్రం పఠించవచ్చు.

2. ఓం నమస్తే గణపతయే త్వమేవ్ ప్రత్యక్షం తత్వమసి..!!

ఓం అంటూ గణేశుడికి నమస్కారాలు తెలియజేయడం. మీరు నిజంగా అంతిమ వాస్తవికత కనిపించే అవతారం అంటూ కొనియాడటం.

3. గజాననం భూతగంధాధి సేవితం కపితజంభు ఫాల్చారు భక్షణం ఉమాసుతం శోక్ వినఃస్కారకం నమామి విఘ్నేశ్వర పాద పంఖజం..!!

అన్నీ కష్టాలను దూరం చేసే విఘ్నేశ్వరుడి పాద పద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భూతగణాలు, ఇతరులచే సేవింపబడే ఏనుగు ముఖము కలవాడు. అతను తన భక్తులు సమర్పించే కపిట్ట (వెలగ పండు), జంబూ (గులాబీ ఆపిల్) రుచికరమైన పండ్లలో పాలుపంచుకుంటాడు. పార్వతీదేవికి ప్రీతిపాత్రమైన కుమారుడు. దుఃఖాలను తొలగించేవాడు, అడ్డంకులను నాశనం చేసేవాడని అర్థం.

4. ఓం ఏక్దంతయే విధ్మహే వక్రతుండయే ధీమహి తన్నో దంతి ప్రచోద్యాత్..!!

ఏక దంతం కలిగిన సర్వవ్యాపి అయిన నీకు మేము ప్రార్థిస్తున్నాము. తెలివి, జ్ఞానం ఇవ్వమని కోరుకుంటూ నమస్కరిస్తున్నానని చెప్పడం.

5. వక్రతుండ్ మహాకయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమయే దేవ్ సర్వ కార్యేషు సర్వదా..!!

మెలితిరిగిన తొండం, విశాలమైన శరీరం, వేయి సూర్యుల వంటి కాంతితో ప్రకాశిస్తూ నా అన్ని పనులలో, అన్ని సమయాలలో ఆటంకాలు నుండి నాకు విముక్తిని అనుగ్రహించమని కోరుకుంటూ ఈ మంత్రం పఠించాలి.

6. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనమ్మే వశమానాయ స్వాహః

శ్రేయస్సును ప్రసాదిస్తూ సమస్త ప్రాణులను రక్షించే వినాయక మీకు నేను నమస్కరిస్తున్నానని దీని అర్థం.

మంత్రాలు పఠించడం వల్ల ప్రయోజనాలు

ఈ గణేష్ మంత్రాలను జపించడం వల్ల ఒకరి శ్రేయస్సుకు మధ్య ఉన్న ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి. సంపద, జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు, అన్ని ప్రయత్నాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రాలు పఠించిన వారిలో వినయం, ధర్మం, ఉన్నతమైన జ్ఞానం పొందుతారు.

ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఒకరి జీవితంలోని అన్ని ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఎవరైనా చేపట్టాలనుకునే అన్ని కొత్త వెంచర్‌లలో విజయం లభిస్తుంది. భక్తి, సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. ఈ మంత్రాలను జపించడం వలన ఎవరైనా ఏ రకమైన వ్యాధులతో బాధపడుతున్నా, మానసిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నట్లయితే వాటిని అధిగమించగలిగే శక్తి మీకు లభిస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం