Vinayaka chavithi puja: వినాయక చవితి రోజు గణపతికి ఏం సమర్పించాలి? ఏం సమర్పించకూడదో తెలుసుకోండి-what should be offered to ganapati on vinayaka chavithi know what not to submit ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi Puja: వినాయక చవితి రోజు గణపతికి ఏం సమర్పించాలి? ఏం సమర్పించకూడదో తెలుసుకోండి

Vinayaka chavithi puja: వినాయక చవితి రోజు గణపతికి ఏం సమర్పించాలి? ఏం సమర్పించకూడదో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Sep 05, 2024 05:00 PM IST

Vinayaka chavithi puja: వినాయక చవితి రోజు పూజలో గణపతికి ఏం సమర్పించాలి? తులసి సమర్పించవచ్చా? లేదా? ఏం సమర్పించకూడదు అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాటి ప్రకారం పూజ చేస్తే వినాయకుడు భక్తుల కోరికలు తీరుస్తాడని అంటారు.

వినాయకుడికి ఏం సమర్పించాలి?
వినాయకుడికి ఏం సమర్పించాలి? (pxabay)

Vinayaka chavithi puja: వినాయక చవితి పండుగను 07 సెప్టెంబర్ 2024న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పండుగను శ్రీ గణేశుడి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో గణపతి బప్పా విగ్రహాన్ని

 శ్రీ గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ రోజున ఆయనకు ఇష్టమైన వస్తువులను సమర్పిస్తారు. శ్రీ గణేశ భగవానునికి దూర్వా అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. శ్రీ గణేశునికి ఎలాంటి దుర్వాలు సమర్పించాలి, ఏది సమర్పించకూడదు అనేది తెలుసుకోండి. ఏవి సమర్పించడం వల్ల వినాయకుడు ప్రసన్నుడు అవుతాడు, భక్తుల కోరికలు తీరుతాయో చూద్దాం. 

దుర్వా తప్పనిసరి 

గణేశుడికి దుర్వా సమర్పించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఇది వారికి ప్రియమైనది. వినాయక పూజలో 21 దుర్వాలు సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వినాయక చవితి రోజు 21 దుర్వాలు తీసుకుని ఎరుపు రంగు దారంతో కట్టాలి. వాటితో వినాయకుడికి నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. 

అలాగే 11 దుర్వా తీసుకుని వాటిని పసుపు వస్త్రంలో చుట్టి వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసే వరకు పూజలో ఉంచాలి. నిమజ్జనం రోజు వీటిని కూడా నీటిలో వదిలిపెట్టాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. లాభాల బాట పడతారు. 

తులసి సమర్పించవచ్చా?

సాధారణంగా వినాయకుడి పూజలో తులసి ఉపయోగించరు. తన పూజలో తులసిని వినియోగించకూడదని గణేశుడు శపిస్తాడు. మహా విష్ణువుకు ప్రీతికరమైనది తులసి. కానీ వినాయక చవితి రోజు మాత్రం సమర్పిస్తారు. గణపతికి చేసే 21 పత్రి పూజలో తులసి ఆకులు కూడా ఉంటాయి. కానీ ఈ ఆకులు వినాయకుడి విగ్రహం మీద మాత్రం పెట్టకూడదు. 

గణేశుడికి ప్రీతికరమైనవి ఇవే 

శ్రీ గణేశుడికి పండ్లలో అరటిపండు అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా గణేశుడికి మోదకం లేదా లడ్డూలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. వినాయకుడి పూజలో ఎరుపు, పసుపు రంగు పూలు సమర్పించవచ్చు. బంతి, గులాబీ వంటి ఎర్రటి పూలు సమర్పించవచ్చు. పనస, వెలగ, యాపిల్, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. 

గణేశుడికి ఏమి సమర్పించకూడదు?

పురాణాల ప్రకారం గణేశుడు చంద్రదేవుడిని శపించాడు. కావున గణపతి బప్పకు తెల్లని రంగు పూలు, బట్టలు, తెల్లటి పవిత్ర దారం లేదా తెల్లని చందనం సమర్పించకూడదు. తెలుపు రంగు వస్తువులు పూజలో పొరపాటున కూడా పెట్టకూడదు. 

ఏ దేవుడికి ఎటువంటివి ఇష్టం 

మల్లెపూలు, శమీ, మౌలసిరి, నాగచంప, పలాస తదితర పుష్పాలను మహాదేవునికి సమర్పించవచ్చు. రామ తులసి అయినా, కృష్ణ తులసి అయినా విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. దీనితో పాటు మీరు బేల, బెల్లం, చంపా, మాల్టీ, మేరిగోల్డ్ మొదలైన వాటిని అందించవచ్చు. హనుమాన్ జీకి ఎరుపు రంగు లేదా ఏదైనా సువాసనగల పువ్వును సమర్పించండి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.