Sri yantram: సంపద, శ్రేయస్సును ఆకర్షించేందుకు శ్రీయంత్రం ఈ దిశలో పెట్టుకోవాలి-which direction is best to be placed sri yantra to attract wealth and prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Yantram: సంపద, శ్రేయస్సును ఆకర్షించేందుకు శ్రీయంత్రం ఈ దిశలో పెట్టుకోవాలి

Sri yantram: సంపద, శ్రేయస్సును ఆకర్షించేందుకు శ్రీయంత్రం ఈ దిశలో పెట్టుకోవాలి

Gunti Soundarya HT Telugu
Aug 28, 2024 03:32 PM IST

Sri yantram: ఆర్థిక సమస్యలు, ఇంట్లో అశాంతి వాతావరణం తొలగిపోయేలా చేసేందుకు చాలా మంది ఇంట్లో శ్రీ యంత్రం తగిలించుకుంటారు. అసలు ఈ శ్రీ యంత్రంలో ఉండే త్రిభుజాలు వేటికి సంకేతం. ఈ యంత్రం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

శ్రీయంత్రం ఏ దిశలో పెట్టుకోవాలి?
శ్రీయంత్రం ఏ దిశలో పెట్టుకోవాలి? (pinterest)

Sri yantram: హిందూ ఆధ్యాత్మికతలో శక్తివంతమైన చిహ్నం శ్రీ యంత్రం. ఇది చాలా క్లిష్టమైన గణిత రూపకల్పన. కొద్ది మంది మాత్రమే దీని ప్రతిరూపం చేయగలరు. చాలా మంది తమ ఇళ్లలో శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇది విశ్వ ప్రక్రియను సూచిస్తుందని చెప్తారు. ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సుకు, జీవితంలోని అడ్డంకులను తొలగించేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

శ్రీ యంత్రం అర్థం ఏంటి?

మన శరీరంలో తొమ్మిది చక్రాలు ఉంటాయి. అవి మన శరీర విధులను నియంత్రిస్తాయి. అదే విధంగా శ్రీ యంత్రం కూడా తొమ్మిది పొరలతో రూపొందించారు. త్రైలోక్య చక్రం శ్రీ యంత్రం బయట సరిహద్దును సూచిస్తుంది. భౌతిక ప్రపంచానికి చిహ్నం, ప్రతికూల శక్తుల నుండి రక్షణగా నిలుస్తుంది. 16 రేకుల కమలం ఇందులో వస్తుంది.

శక్తి, ప్రేమ, కరుణకు చిహ్నంగా భావిస్తారు. జీవితంలో సవాళ్లను అధిగమించే సంకల్పాన్ని శక్తిని సూచించే ఎనిమిది రేకుల కమలం ఈ శ్రీ యంత్రం. అందుకే దీన్ని సర్వ సౌభాగ్య దాయక చక్రం అని అంటారు. ఇందులో ప్రాథమికంగా 14 చిన్న త్రిభుజాలు ఉంటాయి. సంపద, శ్రేయస్సు, సమృద్ధితో ఇవి ముడిపడి ఉంటాయి. ఆ తర్వాత పది చిన్న త్రిభుజాలు ఉంటాయి. ఇవి జీవితంలో ఒకరి ఉద్దేశాన్ని నిర్వహించేందుకు ఉంటాయి.

లోపల వైపు ఉంటే మరో 10 త్రిభుజాలు రక్షణ, భద్రత ఇస్తాయని చెబుతారు. మానసిక, శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఎనిమిది చిన్న త్రిభుజాలు కూడా ఉంటాయి. ఆపై ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న ఒకే ఒక త్రిభుజం ఉంటుంది. చివరకు సృష్టికి కేంద్ర బిందువు అయిన ఒక బిందువు ఉంటుంది.

శ్రీయంత్రాన్ని ఎలా శక్తివంతం చేయాలి?

శ్రీ యంత్రాన్ని శక్తివంతం చేసేందుకు సరైన మార్గం అనుసరించాలి. ఈ యంత్రాన్ని ఇంటికి తీసుకువచ్చి ఎక్కడ అంటే అక్కడ ఉంచుకోడదు. సరైన పద్ధతి అనుసరించి శ్రీ యంత్రాన్ని కూడా శక్తివంతం చేయాలి. శ్రీ యంత్రం ఉపయోగించే ముందు దానిని రోజు వాటర్, పాలతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి ఆరబెట్టాలి. ఈ ప్రక్షాళన వల్ల దాని మీద పేరుకుపోయిన దుమ్ము, మలినాలను తొలగిస్తుంది. దీనిని శక్తివంతం చేయడానికి మహాలక్ష్మి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ యంత్రంలో ఉన్న కేంద్ర బిందువుపై దృష్టి సారిస్తూ ధ్యానం చేయాలి. ఈ యంత్రాన్ని లక్ష్మీ యంత్రం అని కూడా పిలుస్తారు.

యంత్రాన్ని ఎక్కడ ఉంచాలి

సరైన ప్రయోజనాలు పొందడం కోసం శ్రీ యంత్రాన్ని సరైన ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. తప్పుగా ఉంచడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల శ్రీ యంత్రాన్ని శక్తివంతం చేసిన తర్వాత దానిని మీ ఇంటికి లేదా ఇంటి పూజ గదికి తూర్పు దిశలో ఉంచాలి. ఈ సరైన స్థలం ఎందుకంటే ఇది ఉదయించే సూర్యుడి దిశ. సూర్య కాంతి పడటం వల్ల ప్రతిరోజు దీని శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఒకవేళ తూర్పున ఉంచడం సాధ్యం కాకపోతే ఈశాన్య దిక్కులో ఉంచేందుకు ప్రయత్నించండి.

ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు

శ్రీ యంత్రాన్ని తరచుగా సంపద యంత్రము అని కూడా పిలుస్తారు. ఇది ఆర్థిక సమృద్ధిని సాధించేందుకు సహాయపడుతుంది. ఆర్థిక విజయం, సంపదను ఇచ్చేందుకు సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. పురోభివృద్ధికి అవకాశాలు తెరుచుకుంటాయి.

ధ్యానం కోసం

మానసిక ప్రశాంతత కోసం లోతైన ధ్యానం చేసేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ యంత్రంలోని బిందువుపై దృష్టి సారించడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. మన చుట్టూ పాజిటివ్ శక్తులతో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

శ్రీ యంత్రం ఇంటి లోపల శక్తిని నిర్వహించేందుకు సమతుల్యత చేసేందుకు కూడా ఉపయోగిస్తారు. ఇందులోని రేఖలు విభిన్న శక్తులకు మార్గాలని చూపుతాయి. వాటిని సరైన మార్గంలో ఇల్లు మొత్తం విస్తరించేలా చేస్తాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి శాంతి, శ్రేయస్సును ఆహ్వానిస్తాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్