తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Aswayuja Masam : ఆశ్వయుజ మాసం అంటేనే పండుగలకు పెట్టింది పేరు.. దాని ప్రత్యేకతలు ఇవే

Aswayuja Masam : ఆశ్వయుజ మాసం అంటేనే పండుగలకు పెట్టింది పేరు.. దాని ప్రత్యేకతలు ఇవే

24 September 2022, 15:38 IST

    • Ashwayuja Masam : ఆశ్వయుజ మాసం అంటేనే పండుగల మాసం దేవతారాధనకు, దీపారాధనకు ప్రాధాన్యతతో కూడియున్నటువంటి మాసంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చేసే శమీ పూజకు, దేవీ ఆరాధనలకు, గోపూజలకు విశేషమైనటువంటి పుణ్య ఫలం అని శాస్త్రికం అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరశర్మ తెలిపారు. అయితే ఈ మాసం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆశ్వయుజ మాస వైశిష్ట్యం
ఆశ్వయుజ మాస వైశిష్ట్యం

ఆశ్వయుజ మాస వైశిష్ట్యం

Aswayuja Masam : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు అశ్విని నక్షత్రానికి దగ్గరగా ఉండటం వలన ఈ మాసానికి ఆశ్వయుజ మాసం అని పేరు. ఆశ్వయుజి అంటే స్త్రీ అని, దేవి అని అర్థం. దక్షిణాయనంలో ఆషాఢ మాసం గురుపూజకు, శ్రావణమాసం లక్ష్మీదేవి పూజలకు, భాద్రపద మాసం విఘ్నేశ్వర ఆరాధనకు, ఆశ్వయుజ మాసం శక్తి ఆరాధనకు (అమ్మవారు), కార్తీక మాసం శివారాధనకు ప్రత్యేకం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

శరన్నవరాత్రులు

ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. సంవత్సరంలో నవరాత్రులకు ప్రత్యేక స్థానమున్నది. ప్రతీ సంవత్సరం రెండు నవరాత్రులు విశేషముగా చేసెదరు. ఒకటి ఉత్తరాయణంలో వచ్చే చైత్ర నవరాత్రులు, ఆశ్వయుజంలో వచ్చే శరన్నవరాత్రులు. ఇవి రెండు కూడా అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన, ప్రాధాన్యతతో కూడిన రోజులు. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో చేసేటువంటి నవరాత్రుల పూజల వలన అనారోగ్య సమస్యలు తొలగి, సౌభాగ్య సిద్ధి కలుగుతుందని దేవీ భాగవతం స్పష్టం చేస్తుంది.

దుర్గాష్టమి

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అమ్మవారు కుజగ్రహానికి రాహు గ్రహానికి అధిపతి. నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేయడం వలన కుజ దోషాలు, రాహుకేతు దోషములు తొలగుతాయి. నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధన చేసిన వారికి సౌభాగ్య ప్రాప్తి కలిగి.. దాంపత్య సౌఖ్యం, ఆయుష్షు, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. ఆశ్వయుజ మాసంలో ఏడవరోజు అమ్మవారి అవతారం సరస్వతీ అవతారం. ఈ రోజు సరస్వతి దేవిని పూజించడం అక్షరాభ్యాసం వంటివి చేయడం మంచిది. ఆశ్వయుజ మాసంలో వచ్చే అష్టమిని దుర్గాష్టమి అంటారు. ఆ ఈ రోజు దుర్గాదేవిని పూజించిన వారికి ఆరోగ్యసిద్ధి, సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తారు.

విజయదశమి

ఆశ్వయుజ మాసంలో వచ్చే ఆశ్వయుజ శుక్ల దశమిని విజయదశమి అంటారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్ర మదనము చేసినపుడు.. ఆ సముద్రము నుంచి అమృతభాండము బయటపడింది. ఆ రోజునే విజయదశమిగా.. త్రేతాయుగములో రావణున్ని సంహరించినటువంటి రోజు విజయదశమిగా.. ద్వాపర యుగంలో శమీ వృక్షమును పూజించి ఆ వృక్షముమీద దాచుకున్న ఆయుధాల్ని తీసుకుని కౌరవులు విజయం పొందినటువంటి రోజే విజయదశమి అని మన పురాణాలు తెలిపాయి.

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం దశమి రోజు ఏలాంటి పనియైనా ముహూర్తంతో పనిలేకుండా ఆచరించవచ్చునని.. ఈ రోజు ఏ పనియైనా అమ్మవారిని పూజించి ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారని జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజు దూడతో కూడిన ఆవును పూజిస్తారు. ఆశ్వయుజ మాసంలో బహుళ తదియను అట్లతదియ అంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ త్రయోదశిని.. ధన త్రయోదశి అంటారు. ఆ రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు.

ఆశ్వయుజ మాసంలో బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా సత్యభామ కృష్ణులు కలిపి నరకాసుని వధించినట్లుగా పురాణాలు తెలిపాయి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యను దీపావళిగా నరకాసుని సంహరించిన దానికి గుర్తుగా జరుపుకుంటారు.