తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dussehra Holidays 2022 : దసరా సెలవులపై క్లారిటీ.. మెుత్తం ఎన్నిరోజులు అంటే?

Dussehra Holidays 2022 : దసరా సెలవులపై క్లారిటీ.. మెుత్తం ఎన్నిరోజులు అంటే?

HT Telugu Desk HT Telugu

21 September 2022, 15:57 IST

google News
    •  Dussehra Holidays 2022 Dates : బుధవారం నుంచి దసరా సెలవులు తగ్గిస్తారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా విద్యాశాఖ ఈ విషయంపై ప్రకటన ఇచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

Dussehra Holidays 2022 Telangana : 2022-2023 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే దసరా సెలవుల తేదీలను ప్రకటించారు. అయితే సెలవులను కుదింపు చేస్తున్నారని ప్రచారం జరిగింది. గతంలో భారీ వర్షాల కారణంగా సెలవులు ఇచ్చారు. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీ చేసేందుకు దసరా సెలవులు తగ్గించాలని విద్యాశాఖకు ఎస్ సీఈఆర్టీ సూచించింది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ స్కూల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం తెలియజేశారు.

సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది విద్యాశాఖ. ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. భారీ వర్షాల కారణంగా జులైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున,, నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని ఎస్‌సీఈఆర్‌టీ చేసిన సూచనను తిరస్కరించింది.

సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 9 వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని అన్ని ప్రాథమిక/అప్పర్ ప్రైమరీ/హైస్కూళ్లకు దసరా సెలవులు ఇప్పటికే ప్రకటించినట్లు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) మంగళవారం పాఠశాల విద్యాశాఖకు ప్రతిపాదన పంపినట్లుగా వార్తలు వచ్చాయి.

సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులను ప్రకటించింది. వచ్చే నెల 5న దసరా పండుగ ఉంది. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగుతాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.

ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజుగా పేర్కొంది. ఏప్రిల్ 25 నుండి జూన్ 11, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి.సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుండి 28 వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఉండగా.. నాన్ మిషనరీ పాఠశాలలకు జనవరి 13 నుండి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులను షెడ్యూల్ చేశారు.

తదుపరి వ్యాసం