TSRTC Special Buses : దసరా స్పెషల్… 3 వేలకుపైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-tsrtc runs special buses from 24 september over bathukamma dasara ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc Runs Special Buses From 24 September Over Bathukamma Dasara

TSRTC Special Buses : దసరా స్పెషల్… 3 వేలకుపైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Mahendra Maheshwaram HT Telugu
Sep 17, 2022 04:22 PM IST

TSRTC Runs Special Buses: దసరా పండుగ నేప‌థ్యంలో ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పంది తెలంగాణ ఆర్టీసీ. ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నిర్ణయించింది.

టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు (tsrtc)

TSRTC Runs Special Buses For Dasara: దసరా పండుగ నేప‌థ్యంలో ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పంది తెలంగాణ ఆర్టీసీ. ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై దృష్టిపెట్టింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని రంగారెడ్డి రీజయన్‌ నుంచి దాదాపు 3వేలకుపైగా ఆర్టీసీ బస్సులను దసరా స్పెషల్స్‌గా జిల్లాలకు నడిపించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.

నగరంలోని జేబీఎస్‌, సికింద్రాబాద్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, కోఠి వంటి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్‌ బస్సులు నడుపుతారు. బతుకమ్మ, దసరా నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊర్లకు వెళ్లడం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు.

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Hyderabad TSRTC Buses: ఐటీ ఉద్యోగాలు, కోకాపేట్ సెజ్ వైపు వెళ్లేవారికి టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ కొత్త బస్సుల వివరాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బస్సులు కోటి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టిప్పుఖాన్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నరిసింగి మీదుగా నడుస్తాయి. మొదటి బస్సు ఉదయం 6:00 గంటలకు దిల్‌సుఖ్‌నగర్ నుండి బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు డిపో నుండి బయలుదేరుతుంది.

సెప్టెంబర్ 10న కొత్త వాహనాలను ప్రవేశపెట్టిన ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, దిల్‌సుఖ్‌నగర్-కోకాపేట్ మార్గంలో రద్దీని తగ్గించడానికి ప్రతి 40 నిమిషాలకు బస్సులను నడుపుతుంది. మరిన్ని వివరాల కోసం 040-23450033/69440000 నంబర్లలో TSRTCని సంప్రదించవచ్చు.

మరోవైపు మెదక్ చర్చికి ప్రత్యేక బస్సులను ప్రకటించింది ఆర్టీసీ. రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రదేశాల నుండి బస్సులు ఏర్పాటు చేశారు. JBS బస్ స్టాప్, నారాయణఖేడ్, జహీరాబాద్ నుంచి బస్ సర్వీసులు ఉంటాయి. జహీరాబాద్‌ నుంచి మెదక్‌కు ఉదయం 6:30 గంటలకు బస్సు వెళ్లాల్సి ఉంది. మెదక్‌ నుంచి జహీరాబాద్‌కు తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు బస్‌ ఉంటుంది. నారాయణఖేడ్ పట్టణం నుండి బస్సు ఉదయం 8:30 గంటలకు బయలుదేరి మెదక్ నుండి మధ్యాహ్నం 2:00 గంటలకు తిరిగి వస్తుంది.

JBS బస్ స్టాప్ నుండి, బస్సులు ఉదయం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్రీక్వెన్సీతో బయలుదేరాలి. మెదక్ చర్చి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే చర్చిలలో ఒకటి. ఇది డిసెంబర్ 1924లో నిర్మించారు. 300 ఎకరాలలో విస్తరించి ఉంది. బ్రిటన్ నుండి దిగుమతి చేసుకున్న మొజాయిక్ టైల్స్, భారీ స్తంభాలు, గాజు కిటికీలతో ఎంతో ఆకర్శనీయంగా ఉంటుంది.

WhatsApp channel