DA hike : డీఏ పెంపుపై కేంద్రం కసరత్తు.. దసరాలోపు ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!-7th pay commission da hike government likely to announce the good news during navratri ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  7th Pay Commission Da Hike, Government Likely To Announce The Good News During Navratri

DA hike : డీఏ పెంపుపై కేంద్రం కసరత్తు.. దసరాలోపు ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Sharath Chitturi HT Telugu
Sep 19, 2022 03:48 PM IST

7th pay commission DA hike : డీఏ పెంపుపై కేంద్రం కసరత్తులు చేస్తోంది! దసరాలోపు 4శాతం డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ అందే అవకాశం ఉంది.

డీఏ పెంపుపై కేంద్రం కసరత్తు.. దసరాలోపు ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!
డీఏ పెంపుపై కేంద్రం కసరత్తు.. దసరాలోపు ఉద్యోగులకు గుడ్​ న్యూస్​! (REUTERS)

DA hike news in Telugu : పండుగ సీజన్​ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి గుడ్​ న్యూస్​ అందే అవకాశం ఉంది! డీఏ(డియర్నెస్​ అల్లోవెన్స్​) పెంపుపై కేంద్రం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. దసరాలోపు ఈ విషయంపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

7th pay commission DA hike : డీఏ పెంపు ఎంతంటే..

మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4శాతం పెరగవచ్చు. ప్రస్తుతం 34శాతం ఉన్న డీఏ.. 38శాతానికి చేరవచ్చు. డీఏ పెంపుతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు జులై, ఆగస్టు నెలకు సంబంధించిన ఏరియర్స్​ కూడా దక్కొచ్చు.

DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి డీఏని ప్రతి యేటా రెండుసార్లు సవరిస్తారు. మొదటిది జనవరి నుంచి జూన్​ వరకు ఇస్తారు. రెండోది డిసెంబర్​ నుంచి జులై వరకు ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏని పెంచుతున్నట్టు ఈ ఏడాది మార్చ్​ 30న ప్రకటించింది కేంద్రం. ఫలితంగా డీఏ 34శాతానికి చేరింది. 1.16కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందారు. 7వ సెంట్రల్​ పే కమిషన్​ సిఫార్సుల మేరకు అప్పుడు డీఏ పెంచింది కేంద్రం.

ఒడిశాలో 3శాతం డీఏ పెంపు..

Odisha government employees DA hike : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏని పెంచుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 3శాతం డీఏ పెంపును ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనను సీఎం నవీన్​ పట్నాయక్​ నేడు ఆమోదించారు.

ఫలితంగా ఒడిశా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ.. 31శాతం నుంచి 34శాతానికి చేరింది. ఇది 2022 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం