DA hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు!
DA hike | 7వపే కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Dearness Allowance (DA) లో 4% పెంపు ఉండబోతోందని సమాచారం.
DA hike | ఈ 4% కరువు భత్యం( (DA) పెంపు తో ఉద్యోగులకు వార్షికంగా కనీసం రూ. 8640 నుంచి గరిష్టంగా రూ. 27,312 లవరకు వేతనంలో పెరుగుదల ఉంటుంది. ఈ పెంపు జులై 1 వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. డీఏ పెంపుపై ప్రభుత్వం త్వరలో ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
DA hike | కేబినెట్ నిర్ణయం
డీఏ పెంపు పై ఆగస్ట్ మొదటివారంలో జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇటీవల ప్రకటించిన దేశీయ వినియోగదారుల ధరల సూచీ(All India Consumer Price Index -AICPI) గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు 4% వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
DA hike | 38 శాతానికి పెంపు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34% డీఏ పొందుతున్నారు. ఈ నాలుగు శాతం పెంపుతో అది 38 శాతానికి పెరుగుతుంది. మొత్తంగా, ఈ పెంపు వల్ల బేసిక్ సాలరీ రూ. 18 వేలు ఉన్న ఉద్యోగికి రూ. 8640 ల అదనపు డీఏ లభిస్తుంది.
DA hike | 7వ పే కమిషన్
7వ పే కమిషన్ ను 2013 సెప్టెంబర్ 25న ఏర్పాటు చేశారు. ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతనాల పెంపుపై ఈ కమిషన్ సిఫారసులు చేస్తుంది. దీని చైర్మన్‌గా జస్టిస్ ఏకే మాథుర్ ను నియమించారు. ఈ కమిషన్ సిఫారసులు 2016, జనవరి 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అనంతరం, 2016 జూన్‌లో ఈ 7వ పే కమిషన్ సిఫారసులను కేంద్రం ఆమోదించింది.