తెలుగు న్యూస్  /  ఫోటో  /  High-risk Pregnancy | గర్భిణీ స్త్రీలు ఇలాంటి సంకేతాలను ఏమాత్రం విస్మరించొద్దు!

High-risk Pregnancy | గర్భిణీ స్త్రీలు ఇలాంటి సంకేతాలను ఏమాత్రం విస్మరించొద్దు!

15 June 2022, 21:30 IST

గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో తల్లికి లేదా శిశువుకు ఏదైనా సమస్య తలెత్తి వారి ప్రాణానికి ప్రమాదం ఏర్ప్అడితే దానిని హైరిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. దీనికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో మోతీ నగర్ లోని అపోలో క్రెడిల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్ లోని గైనకాలజిస్ట్ డాక్టర్ సీమా శర్మ వివరించారు.

  • గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో తల్లికి లేదా శిశువుకు ఏదైనా సమస్య తలెత్తి వారి ప్రాణానికి ప్రమాదం ఏర్ప్అడితే దానిని హైరిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. దీనికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో మోతీ నగర్ లోని అపోలో క్రెడిల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్ లోని గైనకాలజిస్ట్ డాక్టర్ సీమా శర్మ వివరించారు.
తల్లికి ముందు నుంచే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు ఉంటే లేదా జన్యుపరమైన సిండ్రోమ్‌లు, రక్తహీనత వంటివి ఉంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీకి ఆస్కారం ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్, డ్రగ్స్ లేదా సిగరెట్‌ అలవాట్లు కూడా కారణం కావొచ్చు.
(1 / 8)
తల్లికి ముందు నుంచే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు ఉంటే లేదా జన్యుపరమైన సిండ్రోమ్‌లు, రక్తహీనత వంటివి ఉంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీకి ఆస్కారం ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్, డ్రగ్స్ లేదా సిగరెట్‌ అలవాట్లు కూడా కారణం కావొచ్చు.(Pixabay)
మొదటి త్రైమాసికంలో రక్తస్రావం లేదా యోని వద్ద రక్తపు మరకలు చాలా సాధారణం. కానీ రెండవ లేదా మూడవ త్రైమాసికంలో రక్తస్రావం తరచుగా జరిగితే అది ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం వంటి సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల గర్భంతో ఉన్నప్పుడు రక్తస్రావాలు జరిగితే లేదా అసాధారణమైన రంగులో ఉత్సర్గ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
(2 / 8)
మొదటి త్రైమాసికంలో రక్తస్రావం లేదా యోని వద్ద రక్తపు మరకలు చాలా సాధారణం. కానీ రెండవ లేదా మూడవ త్రైమాసికంలో రక్తస్రావం తరచుగా జరిగితే అది ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం వంటి సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల గర్భంతో ఉన్నప్పుడు రక్తస్రావాలు జరిగితే లేదా అసాధారణమైన రంగులో ఉత్సర్గ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.(Pixabay)
అస్పష్టమైన దృష్టి, కళ్ళజోడు పాయింట్లలో తరచుగా మార్పు, తాత్కాలికంగా చూపు కోల్పోవడం, కాంతి సున్నితత్వం, మెరుస్తున్నట్లు లైట్లు వంటి సంకేతాలు ప్రీఎక్లాంప్సియా సమస్యకు స్పష్టమైన సూచన. ఇవి అధిక రక్తపోటు, ఇతర అవయవాలకు నష్టం కలిగించే సంకేతాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అవి వేగంగా తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.
(3 / 8)
అస్పష్టమైన దృష్టి, కళ్ళజోడు పాయింట్లలో తరచుగా మార్పు, తాత్కాలికంగా చూపు కోల్పోవడం, కాంతి సున్నితత్వం, మెరుస్తున్నట్లు లైట్లు వంటి సంకేతాలు ప్రీఎక్లాంప్సియా సమస్యకు స్పష్టమైన సూచన. ఇవి అధిక రక్తపోటు, ఇతర అవయవాలకు నష్టం కలిగించే సంకేతాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అవి వేగంగా తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.(Pixabay)
గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ఒక్కోసారి తలనొప్పి రావడం లేదా తలతిరగడం సహజం. కానీ తరచుగా మైకము, తీవ్రమైన తలనొప్పులు లేదా కళ్లు తిరగడం వంటివి ప్రీఎక్లంప్సియా లక్షణం కావచ్చు. వెంటనే చికిత్స చేయకపోతే అది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
(4 / 8)
గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ఒక్కోసారి తలనొప్పి రావడం లేదా తలతిరగడం సహజం. కానీ తరచుగా మైకము, తీవ్రమైన తలనొప్పులు లేదా కళ్లు తిరగడం వంటివి ప్రీఎక్లంప్సియా లక్షణం కావచ్చు. వెంటనే చికిత్స చేయకపోతే అది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.(Pixabay)
ముఖం, చేతులు లేదా పాదాలలో ఆకస్మిక వాపు, కాళ్లు, చీలమండలు, పాదాలు, వేళ్లలో క్రమంగా వాపు పెరగటం అనేది గర్భధారణ సమయంలో సర్వసాధారణం. గర్భం అభివృద్ధి చెందుతున్నకొద్దీ మరింత హెచ్చు అవుతుంది. కానీ ముఖం, చేతులు లేదా పాదాలలో అకస్మాత్తుగా వాపు పెరగడం ప్రీఎక్లంప్సియాకు సంకేతం. వెంటనే చికిత్స చేయకపోతే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
(5 / 8)
ముఖం, చేతులు లేదా పాదాలలో ఆకస్మిక వాపు, కాళ్లు, చీలమండలు, పాదాలు, వేళ్లలో క్రమంగా వాపు పెరగటం అనేది గర్భధారణ సమయంలో సర్వసాధారణం. గర్భం అభివృద్ధి చెందుతున్నకొద్దీ మరింత హెచ్చు అవుతుంది. కానీ ముఖం, చేతులు లేదా పాదాలలో అకస్మాత్తుగా వాపు పెరగడం ప్రీఎక్లంప్సియాకు సంకేతం. వెంటనే చికిత్స చేయకపోతే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.(Pixabay)
మొదటి త్రైమాసికంలో మహిళ శరీరం పెరుగుతున్న శిశువు కోసం సిద్ధమవుతుంది. కడుపులో నొప్పి లేదా తిమ్మిరి సాధారణం. కానీ 30 నుండి 60 నిమిషాలకు పైగా తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరి ఉంటే ఇది హైరిస్క్ ప్రెగ్నెన్సీకి సంకేతం. ఇది ప్రాణాంతకం కూడా. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
(6 / 8)
మొదటి త్రైమాసికంలో మహిళ శరీరం పెరుగుతున్న శిశువు కోసం సిద్ధమవుతుంది. కడుపులో నొప్పి లేదా తిమ్మిరి సాధారణం. కానీ 30 నుండి 60 నిమిషాలకు పైగా తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరి ఉంటే ఇది హైరిస్క్ ప్రెగ్నెన్సీకి సంకేతం. ఇది ప్రాణాంతకం కూడా. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.(Pixabay)
గర్భం దాల్చి 20-22 వారాలకు పైబడినపుడు పిండం కదలికలు సాధారణం అవుతాయి. మూడవ-సెమిస్టర్ మహిళలు క్రమం తప్పకుండా పిండం కదలికలను అనుభవించగలగాలి. పిండం కదలికలో ఆకస్మిక తగ్గుదల ఉంటే అది ప్రమాదానికి సంకేతం కావచ్చు. 2 గంటల వ్యవధిలో కనీసం 10 పిండం కదలికలు లేనట్లయితే గర్భిణీ స్త్రీలు తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.
(7 / 8)
గర్భం దాల్చి 20-22 వారాలకు పైబడినపుడు పిండం కదలికలు సాధారణం అవుతాయి. మూడవ-సెమిస్టర్ మహిళలు క్రమం తప్పకుండా పిండం కదలికలను అనుభవించగలగాలి. పిండం కదలికలో ఆకస్మిక తగ్గుదల ఉంటే అది ప్రమాదానికి సంకేతం కావచ్చు. 2 గంటల వ్యవధిలో కనీసం 10 పిండం కదలికలు లేనట్లయితే గర్భిణీ స్త్రీలు తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి

కోవిడ్ లక్షణాలు ఉంటే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యుల సలహా ఇది!

కోవిడ్ లక్షణాలు ఉంటే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యుల సలహా ఇది!

Dec 30, 2021, 05:33 PM
Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Jun 14, 2022, 02:42 PM
Pregnancy Tips : ఆ సమయంలో ట్రై చేస్తే.. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ

Pregnancy Tips : ఆ సమయంలో ట్రై చేస్తే.. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ

Jun 08, 2022, 02:08 PM
శిశువు ఆరోగ్యానికి తొలి 1000 రోజులే కీలకం.. ఎందుకో తెలుసా?

శిశువు ఆరోగ్యానికి తొలి 1000 రోజులే కీలకం.. ఎందుకో తెలుసా?

Dec 30, 2021, 05:44 PM
Pregnancy Symptoms: మీలో ఈ లక్షణాలు ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫమ్!

Pregnancy Symptoms: మీలో ఈ లక్షణాలు ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫమ్!

May 15, 2022, 09:37 PM