తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pregnancy Tips : ఆ సమయంలో ట్రై చేస్తే.. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ

Pregnancy Tips : ఆ సమయంలో ట్రై చేస్తే.. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ

08 June 2022, 14:08 IST

పెళ్లయ్యాక గర్భం దాల్చడం ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. దీని అర్థం శారీరక వైకల్యమే కాదు. బహుశా సంభోగం సమయం కూడా కావొచ్చు. అయితే అండోత్సర్గము కాలిక్యులేటర్, క్యాలెండర్ ఈ విషయంలో మీకు సహాయం చేస్తాయి అంటున్నారు గైనకాలజిస్టులు.  

  • పెళ్లయ్యాక గర్భం దాల్చడం ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. దీని అర్థం శారీరక వైకల్యమే కాదు. బహుశా సంభోగం సమయం కూడా కావొచ్చు. అయితే అండోత్సర్గము కాలిక్యులేటర్, క్యాలెండర్ ఈ విషయంలో మీకు సహాయం చేస్తాయి అంటున్నారు గైనకాలజిస్టులు.  
పెళ్లయిన తర్వాత గర్భం దాల్చలేకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే మీలో పునరుత్పత్తి సమస్యలు ఉన్నాయని భావించడానికి సరికాదు అంటున్నారు గైనాకాలజిస్ట్. అయితే మీకు సంతానోత్పత్తి విండో గురించి తెలియాల్సి ఉంది అంటున్నారు.
(1 / 8)

ఏ సమయంలో సెక్స్ చేస్తే.. గర్భవతి అయ్యే అవకాశాలు పెరుగుతాయో అనే అంశాలపై.. గైనకాలజిస్టులు సలహాలు ఇస్తారు. అంతేకాకుండా అండోత్సర్గము కాలిక్యులేటర్ సహాయంతో మీరు కూడా దీని సమాధానం పొందవచ్చు. 
(2 / 8)

గర్భం ధరించాలనుకుంటే.. గుడ్డును తప్పనిసరిగా స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చేయాలి. అండోత్సర్గము సమయంలో, మీ అండాశయం నుంచి గుడ్డు విడుదల అవుతుంది. అది ఫెలోపియన్ ట్యూబ్‌లోకి చేరి అక్కడ ఫలదీకరణం చెందుతుంది.
(3 / 8)

మీ అండోత్సర్గము సమయంలో స్పెర్మ్ ఉన్నట్లయితే.. ఫలదీకరణ అవకాశాలు పెరుగుతాయి. ఈ ఫలదీకరణ గుడ్ల నుంచి పిండం ఏర్పడుతుంది, ఇది క్రమంగా శిశువు రూపాన్ని సంతరించుకుంటుంది.
(4 / 8)

అండోత్సర్గానికి 5 రోజుల ముందు సెక్స్ చేయడం లేదా అండోత్సర్గము రోజున సెక్స్ చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో అండోత్సర్గము మూడు రోజుల ముందు నుంచి అండోత్సర్గము రోజు వరకు గర్భం ధరించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. ఈ సమయంలో సెక్స్ చేయడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.
(5 / 8)

అండోత్సర్గము తర్వాత 12-14 గంటల తర్వాత గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే గుడ్లు ఫెలోపియన్ నాళాలలో నివసించవు.
(6 / 8)

అండోత్సర్గము సమయాన్ని ఎలా కనుగొనాలనేది ఇప్పుడు ప్రశ్న. ప్రతి స్త్రీ శరీరం, ఋతుక్రమాలు భిన్నంగా ఉంటాయి. ఇది తరచుగా అండోత్సర్గము కోసం 14 వ రోజు ఉత్తమ రోజుగా భావిస్తారు. ఒక్కోసారి అది కూడా తప్పే అవ్వొచ్చు.
(7 / 8)

పీరియడ్స్‌కు 12 నుంచి 18 రోజుల ముందు గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. అండోత్సర్గము ఎప్పుడు జరుగుతోందో తనిఖీ చేయడానికి మార్కెట్‌లో కిట్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. మీరు డాక్టర్ సలహాపై కూడా వాటిని వినియోగించవచ్చు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి