Pregnancy Symptoms: మీలో ఈ లక్షణాలు ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫమ్!
07 December 2022, 16:17 IST
- Pregnancy Symptoms: ప్రెగ్నెన్సీ వస్తే మహిళల శరీరం పలు ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి. గర్భం దాల్చిన మొదటి వారంలో లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ప్రెగ్నెన్సీ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
pregnancy symptoms: ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి?
గర్భధారణ సమయంలో ప్రతి మహిళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందరిలనూ అన్ని లక్షణాలు కనిపించాలని లేదు. లక్షణాలు కనిపిస్తే మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ అధారంగా ప్రెగ్నెన్సీ కన్ఫం చేసుకుంటారు. లేదా డాక్టర్‌ను సంప్రదించి గర్భధారణను నిర్ధారించుకుంటారు.
కొన్ని సహజ లక్షణాల అధారంగా కూడా గర్భం దాల్చారా? ... లేదా? గుర్తించవచ్చు. గర్భధారణ అరంభంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి. ఈ లక్షణాల ద్వారా వారు గర్భవతిగా ఉన్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.
రొమ్ము పెరుగుదల, చనుమొన రంగు మార్పు
ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో కనిపించే సాధారణ లక్షణాలు. సహజంగా రొమ్ము కణజాలం చాలా సున్నితంగా ఉంటుంది. గర్భం దాల్చిన వెంటనే శరీరంలో హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. దీంతో రొమ్ము పరిమాణం పెరుగుతుంది. అదే విధంగా, గర్భధారణ సమయంలో మెలనోసైట్లు హార్మోన్ల మార్పుల ద్వారా ప్రభావితమవుతాయి. ఇది చనుమొన రంగును ప్రభావితం చేస్తుంది.
అధిక ఆకలితో పాటు మలబద్ధకం
అధిక ఆకలి గర్భదారణ సమయంలో ఉండే ప్రధాన లక్షణం. గర్భిణీ స్త్రీలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినాలనే కోరిక పుడుతుంది. ఈ సమయంలో మహిళలు తినే రోజువారీ ఆహారం పరిమాణం అకస్మాత్తుగా పెరుగుతుంది. హార్మోన్ల మార్పుల వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, స్త్రీలలో తరచుగా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.
తలనొప్పి, మానసిక ఆందోళన
గర్భధారణ సమయంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. గర్భం ఆరంభంలో కనిపించే ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. గర్భధారణ సమయంలో శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు, ఈ సమయంలో మానసిక స్థితి కూడా ఎప్పటికప్పుడు మారుతుంది. చికాకు పెరుగుతుంది.
వికారం, వాంతులు వంటి అనుభూతి
గర్భధారణలో రోజు ప్రారంభం చాలా గజిబిజిగా ఉంటుంది. ఉదయం లేవగానే బలహీనంగా అనిపించడంతోపాటు వికారం వస్తుంది. తిన్న తర్వాత వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది.
తరచుగా టాయిలెట్‌కి వెళ్లడం
గర్భదారణ సమయంలో మునుపటి కంటే ఎక్కువగా టాయిలెట్‌కి వెళ్తుంటారు. గర్భం దాల్చినప్పుడు కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి, దీని వల్ల తరచుగా టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది.
పీరియడ్స్ మిస్ కావడం
పీరియడ్స్ మిస్ అవడం గర్భధారణకు ఒక సంకేతం. అయితే ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావడం సంభవిస్తుంది.
టాపిక్