Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!-maternal health tips check 4 ways to ensure healthy pregnancies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Jun 14, 2022, 02:45 PM IST HT Telugu Desk
Jun 14, 2022, 02:42 PM , IST

జంటలకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం శుభవార్తే కానీ చాలా మంది మహిళలకు ఇదొక సవాలు లాంటింది. గర్భినీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భినీలు ఆరోగ్యంగా ఉండటానికి వైద్యులు సూచించిన 4 ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రసూతి ఆరోగ్యం అనేది గర్భం ధరించిన స్త్రీలకు ఎంతో ముఖ్యమైన అంశం. గర్భంతో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు. ఇక్కడ తల్లీ-బిడ్డ ఇద్దరి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మహిళ గర్భంతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.

(1 / 7)

ప్రసూతి ఆరోగ్యం అనేది గర్భం ధరించిన స్త్రీలకు ఎంతో ముఖ్యమైన అంశం. గర్భంతో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు. ఇక్కడ తల్లీ-బిడ్డ ఇద్దరి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మహిళ గర్భంతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.(Dominika Roseclay)

గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే కొన్ని సమస్యలు గర్భధారణ మధుమేహం, గర్భధారణ రక్తపోటు, ఆందోళన, నిరాశ, పైల్స్, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపాలు, రక్తహీనత, అంటువ్యాధులు, ప్లాసెంటల్ అబ్రక్షన్ లేదా పిండం సమస్యలు వంటివి తల్లి, బిడ్డకు హాని కలిగించే తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం చాలా అవసరం. గర్భాధారణ నుంచి ప్రసవం, తదనంతరం కూడా ప్రెగ్నెన్సీ కేర్ ఉండాలి. ఇందుకోసం వోకార్డ్ హాస్పిటల్స్‌లో ప్రసూతి కన్సల్టెంట్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ రాజశ్రీ భసలే జాగ్రత్తలు తెలియజేశారు.

(2 / 7)

గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే కొన్ని సమస్యలు గర్భధారణ మధుమేహం, గర్భధారణ రక్తపోటు, ఆందోళన, నిరాశ, పైల్స్, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపాలు, రక్తహీనత, అంటువ్యాధులు, ప్లాసెంటల్ అబ్రక్షన్ లేదా పిండం సమస్యలు వంటివి తల్లి, బిడ్డకు హాని కలిగించే తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం చాలా అవసరం. గర్భాధారణ నుంచి ప్రసవం, తదనంతరం కూడా ప్రెగ్నెన్సీ కేర్ ఉండాలి. ఇందుకోసం వోకార్డ్ హాస్పిటల్స్‌లో ప్రసూతి కన్సల్టెంట్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ రాజశ్రీ భసలే జాగ్రత్తలు తెలియజేశారు.(cottonbro)

1. సమతుల్య ఆహారం తీసుకోండి - గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం తప్పనిసరి. శిశువు పెరుగుదల, అభివృద్ధికి అన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు, సంతృప్త కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు చాలా తినండి. ప్రినేటల్ విటమిన్లు (ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు కాల్షియం) వంటి సప్లిమెంట్లను వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోండి. జంక్, కొవ్వు, నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగాన్ని పరిమితం చేయండి. తగినంత నీరు త్రాగండి. ధూమపానం లేదా మద్యపానానికి దూరంగా ఉండండి.

(3 / 7)

1. సమతుల్య ఆహారం తీసుకోండి - గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం తప్పనిసరి. శిశువు పెరుగుదల, అభివృద్ధికి అన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు, సంతృప్త కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు చాలా తినండి. ప్రినేటల్ విటమిన్లు (ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు కాల్షియం) వంటి సప్లిమెంట్లను వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోండి. జంక్, కొవ్వు, నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగాన్ని పరిమితం చేయండి. తగినంత నీరు త్రాగండి. ధూమపానం లేదా మద్యపానానికి దూరంగా ఉండండి.(Unsplash)

2. ప్రెగ్నెన్సీ డిప్రెషన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ (ప్రసవానంతర) డిప్రెషన్ లాంటి సంకేతాలను అర్థం చేసుకోండి. అలాగే చనుబాలివ్వడం ఎందుకు ప్రయోజనకరం మొదలైన అంశాలపై కౌన్సెలింగ్‌ తీసుకోండి.

(4 / 7)

2. ప్రెగ్నెన్సీ డిప్రెషన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ (ప్రసవానంతర) డిప్రెషన్ లాంటి సంకేతాలను అర్థం చేసుకోండి. అలాగే చనుబాలివ్వడం ఎందుకు ప్రయోజనకరం మొదలైన అంశాలపై కౌన్సెలింగ్‌ తీసుకోండి.(StockPic)

3. రెగ్యులర్ ప్రినేటల్ చెక్-అప్‌లకు వెళ్లండి - రెగ్యులర్ ప్రినేటల్ కేర్ పొందని వారు తక్కువ బరువుతో లేదా ఇతర సమస్యలతో బిడ్డను కనవచ్చు. మీ వైద్యులు పేర్కొన్న ఫాలో-అప్‌లను మిస్ అవ్వకండి. సాఫీగా గర్భం దాల్చడానికి బాగా నిద్రపోండి. ఒత్తిడి లేకుండా ఉండండి. డాక్టర్ సలహా ప్రకారం ఫ్లూ షాట్‌ను తీసుకోండి. ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల తల్లిబిడ్డలు తీవ్రమైన అనారోగ్యాల బారినపడకుండా రక్షించవచ్చు.

(5 / 7)

3. రెగ్యులర్ ప్రినేటల్ చెక్-అప్‌లకు వెళ్లండి - రెగ్యులర్ ప్రినేటల్ కేర్ పొందని వారు తక్కువ బరువుతో లేదా ఇతర సమస్యలతో బిడ్డను కనవచ్చు. మీ వైద్యులు పేర్కొన్న ఫాలో-అప్‌లను మిస్ అవ్వకండి. సాఫీగా గర్భం దాల్చడానికి బాగా నిద్రపోండి. ఒత్తిడి లేకుండా ఉండండి. డాక్టర్ సలహా ప్రకారం ఫ్లూ షాట్‌ను తీసుకోండి. ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల తల్లిబిడ్డలు తీవ్రమైన అనారోగ్యాల బారినపడకుండా రక్షించవచ్చు.(Shutterstock)

4. ప్రతి రోజు వ్యాయామం - రోజువారీ వ్యాయామం మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే వ్యాయామం చేయండి, అది కూడా తేలికైన వ్యాయామం అయి ఉండాలి. భారీ వ్యాయామాలు అస్సలు చేయవద్దు.

(6 / 7)

4. ప్రతి రోజు వ్యాయామం - రోజువారీ వ్యాయామం మీరు గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే డాక్టర్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే వ్యాయామం చేయండి, అది కూడా తేలికైన వ్యాయామం అయి ఉండాలి. భారీ వ్యాయామాలు అస్సలు చేయవద్దు.(Pixabay)

సంబంధిత కథనం

postpartum depressionPCOD/PCOS SymptomsRepresentational Imagepregnancy symptoms: ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి?అండోత్సర్గానికి 5 రోజుల ముందు సెక్స్ చేయడం లేదా అండోత్సర్గము రోజున సెక్స్ చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో అండోత్సర్గము మూడు రోజుల ముందు నుంచి అండోత్సర్గము రోజు వరకు గర్భం ధరించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. ఈ సమయంలో సెక్స్ చేయడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోకోవడం కానీ చేయోద్దు. దీని వల్ల పాదాల వాపు రావచ్చు. కూర్చోవడం వల్ల ఏమైన సమస్య ఉంటే ఎప్పటికప్పుడు మీ స్థితిని మారుస్తూ ఉండాలి
WhatsApp channel

ఇతర గ్యాలరీలు