తెలుగు న్యూస్  /  ఫోటో  /  Navratri Day 1 Pics | ఘనంగా మొదలైన నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి దర్శనం కోసం తరలుతున్న భక్తులు

Navratri Day 1 Pics | ఘనంగా మొదలైన నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి దర్శనం కోసం తరలుతున్న భక్తులు

26 September 2022, 13:54 IST

తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమయిన ఉత్సవాలు, అక్టోబర్ 5 వరకు సాగుతాయి. ఈ నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. సోమవారం, విజయవాడలోని కనక దుర్గమ్మ, జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి మందిర్‌తో సహా వివిధ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.

తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమయిన ఉత్సవాలు, అక్టోబర్ 5 వరకు సాగుతాయి. ఈ నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. సోమవారం, విజయవాడలోని కనక దుర్గమ్మ, జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి మందిర్‌తో సహా వివిధ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.
ముంబై, లాల్‌బాగ్‌లోని కమ్యూనిటీ పండల్‌కు కదిలివస్తున్న దుర్గామాత విగ్రహం
(1 / 8)
ముంబై, లాల్‌బాగ్‌లోని కమ్యూనిటీ పండల్‌కు కదిలివస్తున్న దుర్గామాత విగ్రహం(PTI)
నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు, సోమవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలోని బీవార్‌లో గల జ్వాలాముఖి మాత ఆలయంలో భక్తుల పూజలు.
(2 / 8)
నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు, సోమవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలోని బీవార్‌లో గల జ్వాలాముఖి మాత ఆలయంలో భక్తుల పూజలు.(PTI)
హోటళ్లలోనూ నవరాత్రి ప్లేటర్ పేరిట ప్రత్యేక భోజనం అందిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని 'క్లార్క్స్ అవధ్' లో నవరాత్రి భోజనం.
(3 / 8)
హోటళ్లలోనూ నవరాత్రి ప్లేటర్ పేరిట ప్రత్యేక భోజనం అందిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని 'క్లార్క్స్ అవధ్' లో నవరాత్రి భోజనం.(HT Photo)
భోపాల్‌లో నవరాత్రి ఉత్సవాలకు ముందు నాడు కాళీ మాత విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.
(4 / 8)
భోపాల్‌లో నవరాత్రి ఉత్సవాలకు ముందు నాడు కాళీ మాత విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.(ANI)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున కాన్పూర్‌లోని బరా దేవి ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు
(5 / 8)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున కాన్పూర్‌లోని బరా దేవి ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు(PTI)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున జమ్మూ నుండి 45 కిలోమీటర్ల దూరంలో రియాసి జిల్లాలోని కత్రా వద్ద కొండల్లో కొలువైన మాతా వైష్ణో దేవి మందిరం వైపు తరలుతున్న భక్తజనం
(6 / 8)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున జమ్మూ నుండి 45 కిలోమీటర్ల దూరంలో రియాసి జిల్లాలోని కత్రా వద్ద కొండల్లో కొలువైన మాతా వైష్ణో దేవి మందిరం వైపు తరలుతున్న భక్తజనం(PTI)
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై విద్యుత్ వెలుగుల్లో కనకదుర్గమ్మ ఆలయం. బారులు తీరుతున్న భక్తజనం
(7 / 8)
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై విద్యుత్ వెలుగుల్లో కనకదుర్గమ్మ ఆలయం. బారులు తీరుతున్న భక్తజనం(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి