తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volvo Xc40 Recharge | విలాసవంతమైన వోల్వో ఎలక్ట్రిక్ Suv.. సరసమైన ధరలోనే విడుదల!

Volvo XC40 Recharge | విలాసవంతమైన వోల్వో ఎలక్ట్రిక్ SUV.. సరసమైన ధరలోనే విడుదల!

26 July 2022, 14:41 IST

స్వీడిష్ వాహన తయారీ సంస్థ వోల్వో తమ బ్రాండ్ నుంచి XC40 Recharge పేరుతో ఓ సరికొత్త పూర్తి ఎలక్ట్రిక్- వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. మరిన్ని వివరాలు, ఫోటోలు ఇక్కడ చూడండి.

స్వీడిష్ వాహన తయారీ సంస్థ వోల్వో తమ బ్రాండ్ నుంచి XC40 Recharge పేరుతో ఓ సరికొత్త పూర్తి ఎలక్ట్రిక్- వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. మరిన్ని వివరాలు, ఫోటోలు ఇక్కడ చూడండి.

వోల్వో కంపెనీ తమ పూర్తి-ఎలక్ట్రిక్ XC40 రీఛార్జ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 55.90 లక్షలు. లగ్జరీ SUV సెగ్మెంట్‌లో ఇది అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం. ఈ సరికొత్త కార్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో అనేక అప్‌డేట్‌లతో వచ్చింది.
(1 / 7)

వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUVని బెంగళూరులోనే తమ ఫెసిలిటీ సెంటర్లో స్థానికంగా అసెంబుల్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారులో78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే సుమారు 400 కి.మీల పరిధిని అందిస్తుంది. దీనిలోని మోటార్ 408 hp శక్తిని, 660 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ EV ఐదు సెకన్లలోనే 100 kmph వేగాన్ని అందుకోగలదు. 'వోల్వో XC40 రీఛార్జ్ EV' ఎనిమిదేళ్ల వారంటీ, 11kW సామర్థ్యం గల ఒక వాల్‌బాక్స్ ఛార్జర్‌తో కూడా వస్తుంది. 27 జూలై 2022 నుంచి బుకింగ్స్ ప్రారంభం.
(2 / 7)

ఈ కారులోని హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ మార్వెల్ సూపర్ హీరో థోర్ హామర్ నమూనా నుంచి ప్రేరణ పొందింది. ఇది పిక్సెల్ LED లైటింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. సవరించిన ఫ్రంట్ బంపర్‌తో ఫ్రేమ్‌లెస్ గ్రిల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ కారు బాడీ ప్యానెల్‌ను అందిస్తుంది. ఈ కారులోని LED హెడ్‌లైట్ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా ముందు వైపు ట్రాఫిక్‌కు అనుగుణంగా ఉంటుందని, ఇతర డ్రైవర్లకు ఇబ్బంది లేని వెలుగును ప్రసరింపజేస్తుంది.
(3 / 7)
ఈ కారులోని హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ మార్వెల్ సూపర్ హీరో థోర్ హామర్ నమూనా నుంచి ప్రేరణ పొందింది. ఇది పిక్సెల్ LED లైటింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. సవరించిన ఫ్రంట్ బంపర్‌తో ఫ్రేమ్‌లెస్ గ్రిల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ కారు బాడీ ప్యానెల్‌ను అందిస్తుంది. ఈ కారులోని LED హెడ్‌లైట్ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా ముందు వైపు ట్రాఫిక్‌కు అనుగుణంగా ఉంటుందని, ఇతర డ్రైవర్లకు ఇబ్బంది లేని వెలుగును ప్రసరింపజేస్తుంది.(Volvo)
ఎలక్ట్రిక్ వోల్వో XC40 SUV మంచి కలర్ స్కీములతో, కొత్త వీల్ రిమ్స్ అలాగే విలాసవంతమైన లెదర్-ఫ్రీ అప్హోల్స్టరీతో వస్తుంది.
(4 / 7)
ఎలక్ట్రిక్ వోల్వో XC40 SUV మంచి కలర్ స్కీములతో, కొత్త వీల్ రిమ్స్ అలాగే విలాసవంతమైన లెదర్-ఫ్రీ అప్హోల్స్టరీతో వస్తుంది.(Volvo )
ఈ ఎలక్ట్రిక్ XC40 ఫేస్‌లిఫ్ట్‌తో పాటు, మరొక మోడల్ అయిన వోల్వో C40 రీఛార్జ్ EVని కూడా కంపెనీ విడుదల చేసింది. ఇందులో సరికొత్త పవర్‌ట్రెయిన్‌తో పాటు ట్విన్-మోటార్ వేరియంట్‌ను ఇచ్చారు. దీనిలో ఇచ్చిన 69 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 434 కి.మీల వరకు ప్రయాణించవచ్చని వోల్వో పేర్కొంది.
(5 / 7)
ఈ ఎలక్ట్రిక్ XC40 ఫేస్‌లిఫ్ట్‌తో పాటు, మరొక మోడల్ అయిన వోల్వో C40 రీఛార్జ్ EVని కూడా కంపెనీ విడుదల చేసింది. ఇందులో సరికొత్త పవర్‌ట్రెయిన్‌తో పాటు ట్విన్-మోటార్ వేరియంట్‌ను ఇచ్చారు. దీనిలో ఇచ్చిన 69 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 434 కి.మీల వరకు ప్రయాణించవచ్చని వోల్వో పేర్కొంది.(Volvo)
వోల్వో C40లోని సింగిల్ మోటారు ముందు చక్రాలకు శక్తినిస్తుంది. బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌లో సుమారు 32 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వాహనం పరిచయంతో, కంపెనీ తన EV పోర్ట్‌ఫోలియోను నాలుగు EVలకు విస్తరించింది.
(6 / 7)
వోల్వో C40లోని సింగిల్ మోటారు ముందు చక్రాలకు శక్తినిస్తుంది. బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌లో సుమారు 32 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ వాహనం పరిచయంతో, కంపెనీ తన EV పోర్ట్‌ఫోలియోను నాలుగు EVలకు విస్తరించింది.(Volvo)

    ఆర్టికల్ షేర్ చేయండి